ధర్మశాల టెస్టు: రెండో రోజు టీమిండియాపై అసీస్ పైచేయి.. Nathan Lyon Shines As Australia Claim Advantage On Second Day

Nathan lyon shines as australia claim advantage on second day

india vs australia, team india, australia, steve smith, kuldeep nair, ravichandran ashwin, dharmasala test, fourth test, cricket news, sports news, sports, cricket

Off-spinner Nathan Lyon captured four wickets in the final session to hand Australia an advantage on the second day of the fourth and final cricket Test

ధర్మశాల టెస్టు: రెండో రోజు టీమిండియాపై అసీస్ పైచేయి..

Posted: 03/26/2017 05:37 PM IST
Nathan lyon shines as australia claim advantage on second day

హిమాచల్ ప్రదేశ్ వేదికగా ధర్మశాలలోని స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మద్య జరుగుతున్న ఆఖరుటెస్టు మ్యాచ్ లో రెండో రోజు టీమిండియాపై అసీస్ ఆధిపత్యం కనబర్చింది. మందగించిన పిచ్ పై పరుగులను రాబట్టడంలో టీమిండియా బ్యాట్స్ మెన్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అప్పటికీ చివరి సెషన్ వరకు పటిష్టంగానే వున్న టీమిండియాను నాథన్ లియాన్ దెబ్బతీశాడు. చివరి సెషన్ లో అద్బుతమైన బంతులు విసిరి టీమిండియాను దెబ్బతీశాడు.

రెండో రోజు ఆట‌ముగిసే స‌మ‌యానికి రహానే సేన 6 వికెట్ల న‌ష్టానికి 248 ప‌రుగులు చేసింది. లోకేష్ రాహుల్‌(60) పుజారా(57)లు అర్థ సెంచ‌రీ చేశారు. తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల పరుగులు చేసిన అసీస్ కన్నా.. భార‌త్ ఇంకా 52 ప‌రుగులు వెన‌కంజ‌లో ఉంది. చివ‌రి సెష‌న్‌లో ల‌య‌న్ నాలుగు కీల‌క  వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. 2 వికెట్ల న‌ష్టానికి 157 పరుగులు చేసిన భార‌త్‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు పుజారా, కెప్టెన్ అజింక్యా ర‌హానే. వీరి దూకుడుకు బ్రేక్ వేశాడు ల‌య‌న్‌.

చివ‌రి సెష‌న్‌లో తొలి ఓవ‌ర్‌ను వేసిన ల‌య‌న్ పుజారాను పెవీలియ‌న్‌కు పంపాడు. ఆ వెంట‌నే క‌రుణ్ నాయ‌ర్‌, ర‌హానేను స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఔట్ చేశాడు. బ‌రిలోకి దిగిన అశ్విన్ ర‌విచంద్ర‌న్ కుదుట‌ప‌డే స‌మ‌యంలో మ‌రో అద్భుత‌మైన బంతితో ల‌య‌న్ బోల్తా కొట్టించాడు.  ర‌వీంద్ర జ‌డేజా వ‌చ్చి రాగానే రెండు సిక్స‌ర్ల‌తో జోష్‌ను తీసుకొచ్చాడు. క్రీజులో జ‌డేజా, వృద్ధిమాన్ సాహా ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్ల‌లో ల‌య‌న్ నాలుగు వికెట్లు తీసుకోగా క‌మిన్స్‌, హాజ‌ల్‌వుడ్ చెరో వికెట్ తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  team india  australia  Nathan Lyon  Widdhriman Saha  dharmasala test  cricket  

Other Articles