రెండో టెస్టుపై ప్రత్యర్థులకు విరాట్ కోహ్లీ హెచ్చరికలు Virat Kohli warns Australia, says surprises in Indian team

Virat kohli warns australia says surprises in indian team

rohit sharma, india vs australia, virat kohli, ajinkya rahane, r sridhar, karun nair, hardik pandya, india australia pune test, india australia bengaluru test, m chinnaswamy stadium, national cricket academy, vijay hazare trophy, mumbai, rohit sharma thigh injury, cricket, cricket news, latest sports news, rohit sharma indian cricket team, rohit sharma news, karun nair, r ashwin, kuldeep yadav, sports, cricket news, cricket

Indian captain Virat Kohli assured that his team will never repeat the kind of "bad performance" and "lack of intent" that led to the humiliating opening Test loss to Australia in Pune.

రెండో టెస్టుపై ప్రత్యర్థులకు విరాట్ కోహ్లీ హెచ్చరికలు

Posted: 03/03/2017 09:14 PM IST
Virat kohli warns australia says surprises in indian team

తొలి టెస్టు పుణేలో టీమిండియా చూపిన దారుణ ప్రదర్శనను మరోసారి పునరావృతం కానివ్వబోమని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.  ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో భారత్ 333 పరుగుల తేడాతో భారీ పరాభవాన్ని మూటకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దారుణ ఓటమి నుంచి పాఠాలు చేర్చుకున్నామని చెప్పాడు. పుణే లాంటి ప్రదర్శనను టీమిండియా ఇక ఎప్పుడూ పునరావృతం చేయదని, ఇందుకు తాను హామీ అని కోహ్లీ తెలిపాడు. అయితే బెంగళూరులో జరగనున్న రెండో టెస్టు కోసం తమ జట్టులో కొన్ని సర్ ప్రైజ్ నిర్ణయాలు తీసుకుంటామన్నాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒక్కడే తమ టార్గెట్ కాదని, గత టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ ఆ జట్టును ఆలౌట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కోహ్లీ గుర్తుచేశాడు. 'ఓడినప్పుడు ఆ ఓటమిని అంగీకరించడం ఏ ఆటగాడికైనా ముఖ్యం. తొలి టెస్టులో ఆసీస్ అద్భుతంగా ఆడింది. ఓడినా, గెలిచినా తర్వాతి మ్యాచ్ కు సన్నద్ధమవ్వడం మాకు అలవాటే. నేటి సాయంత్రం అందరం చర్చించి జట్టును డిసైడ్ చేస్తాం. హార్దిక్ పాండ్యా భుజం గాయంతో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అందుకే అతడికి చాన్స్ ఇస్తలేం. జయంత్ యాదవ్ మంచి ఆటగాడు. కేవలం ఒకే సిరీస్ ఆడిన అతడిపై పుణే టెస్టు ప్రదర్శనను చూపించి విమర్శించడం తగదని' కోహ్లీ సూచించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం ఉదయం గం.9.30 ని.లకు ఆసీస్, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat kohli  india  australia  karun nair  hardik pandya  Team India  bangalore  cricket  

Other Articles

Today on Telugu Wishesh