భారత్ భారీ లక్ష్యానికి ధీటుగా బదులిస్తున్న బంగ్లా Team India on track to win match despite visitors' fightback

Team india on track to win match despite visitors fightback

Bangladesh in india 2017, India vs bangladesh, Mahmadullah, Mehedi hasan, Mushfiqur rahim, Shakib al hasan, Test cricket, Umesh yadav, Virat kohl, bangladesh, cricket news, sports news, Cricket, sport

India had to fight to chip away at Bangladesh’s batting order in Hyderabad, but they continued to march towards victory on the third day of the one-off Test match.

భారత్ భారీ లక్ష్యానికి ధీటుగా బదులిస్తున్న బంగ్లా

Posted: 02/11/2017 06:39 PM IST
Team india on track to win match despite visitors fightback

పర్యాటక జట్టుతో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 104 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ కెప్టెన్ ముస్ఫికర్ రహీమ్ భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు. దీంతో మూడో రోజు క్రీజులో ముస్ఫికర్ రహీమ్ 81, మెహిదీ హాసన్ 51 పరుగులతో ఉన్నారు. 41/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు.

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చి షకిబ్.. రహీమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన షబ్బీర్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మెహిదీ హాసన్, కెప్టెన్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 41/1 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ ఆదిలో కీలక వికెట్లను చేజార్చుకుంది. బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(24) ఆరంభంలోనే రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తరువాత కాసేపటికి మొనిముల్ హక్(12), మొహ్మదుల్లా(28) నిష్క్రమించారు.

బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్పికర్ -షకిబుల్ హసన్లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ అత్యంత బాధ్యతగా ఆడుతూ బంగ్లా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే షకిబుల్ (82;103 బంతుల్లో 14 ఫోర్లు) రాణించి ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. ఈ జోడి 107 పరుగుల్ని సాధించడంతో బంగ్లాదేశ్ గాడిలో పడింది. షకిబుల్ అవుటైన స్వల్ప వ్యవధిలో  మరో కీలక ఆటగాడు షబ్బీర్ రెహ్మాన్(16) కూడా పెవిలియన్ చేరాడు. ముష్పికర్ తో జత కలిసిన మొహిది హసన్ మిరాజ్ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. మూడో రోజు ఆటలో ఈ జోడి మొత్తంగా 309 బంతుల్ని ఎదుర్కోవడం ఇక్కడ విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles