కోహ్లీ నేను ఒక్కటే.. పాక్ అటగాడిని ఉతికేసిన నెట్ జనులు Ahmed Shehzad draws flak for Virat Kohli comparison

Ahmed shehzad draws flak for virat kohli comparison

Ahmed shehzad, virat kohli, kane Williamson, joe root, Pakistan cricketer, saj sadiq, ahmed shehzad trolled, ahmed shehzad trolling news, ahmed shehzad trolled news, cricket, cricket news, latest sports news, ahmed shehzad virat kohli news, virat kohli news, kane Williamson news, joe root news, twitter

Ahmed Shehzad has not been able to get a spot back in the squad despite scoring a century in the Pakistan domestic T20 league.

కోహ్లీ నేను ఒక్కటే.. పాక్ అటగాడిని ఉతికేసిన నెట్ జనులు

Posted: 12/22/2016 06:58 PM IST
Ahmed shehzad draws flak for virat kohli comparison

నేను విరాట్ కోహ్లీ ఒక్కటే.. గ్రౌండ్ లోకి దిగితే మా ఇద్దరి ధోరణి ఒకేలా వుంటుంది. విరాట్ కోహ్లీ, నేనే, జో రూట్, కేన్ విలియమ్ సన్ అంతా జట్టు కోసం దూకుడుగా వ్యవహరిస్తాం అంటూ తనకు తానే ప్రపంచ టాప్ క్రికెటర్లతో పోల్చుకున్న పాకిస్తాన్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షెహజాద్‌ ను నెట్ జనులు ఉతికి అరేశారు. తాను విరాట్‌లా ఉంటానని, పరుగులు చేయడంలో ఇద్దరి మధ్య పోలికలు ఉన్నాయని చెప్పడంపై నెట్ జనులు గట్టిగా చురకలు అంటించారు.

అయితే పనిలో పనిగా సొంత జట్టుపై కూడా విమర్శలు చేసిన అహ్మద్ షెహజాద్ తనకు సొంత జట్టు నుంచి ప్రోత్సాహం లేకపోగా.. విరాట్ కోహ్లీ, జో రూట్‌, కేన్‌ విలియమ్సన్‌లకు వారి సొంత జట్టు సభ్యులు, అభిమానుల నుంచి ఎంతో మద్దతు లభిస్తోందని, ఈ విషయంలో తాను దురదృష్టవంతుడినని షెహజాద్‌ చెప్పినట్టుగా పాక్‌కు చెందిన ఓ స్పోర్ట్స్‌ జర్నలిస్టు ఇటీవల ట్వీట్‌ చేశాడు. అలా ట్విట్ రాగానే షెహజాద్ ను పాక్ క్రీడాభిమానులు విమర్శలు గుప్పించారు.

కోహ్లీ, రూట్‌, విలియమ్సన్‌లతో షెహజాద్‌ పోల్చుకోవడం సిగ్గుచేటని, వాళ్లతో పోల్చుకునే అర్హత లేదని ఓ అభిమాని ఘాటుగా స్పందించాడు. షెహజాద్‌ వ్యాఖ్యలను తప్పుపడుతూ పాక్‌ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో సెటైర్లు వేశారు. కోహ్లీ అన్ని ఫార్మాట్లతో దుమ్ములేపుతూ పరుగుల వర్షం కురిపిస్తుండగా, షెహజాద్‌ ఏమో జట్టులో చోటు దొరకగా నానా పాట్లు పడుతున్నాడు. టి-20 ప్రపంచ కప్‌ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత జట్టుకు దూరంగా ఉంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ahmed shehzad  virat kohli  kane Williamson  joe root  Pakistan cricketer  cricket  

Other Articles