వన్డే సిరీస్ ఓటమికి వాళ్లే కారణం: విలియమ్ సన్ Kane Williamson says Black Caps 'failed as a batting unit'

Kane williamson says black caps failed as a batting unit

india vs new zealand, ind vs nz, Kane Williamson, india new zealand, Kane Williamson, new zealand, ind vs nzl, amit mishra, mishra, amit mishra on kumble, amit anil 5 wicket haul, india vs new zealand score, ind vs nz score, cricket score, cricket news, cricket

New Zealand skipper Kane Williamson termed the performance of his batting department as "frustrating", and they did not justify to lose eight wickets for just 16 runs.

వన్డే సిరీస్ ఓటమికి వాళ్లే కారణం: విలియమ్ సన్

Posted: 10/30/2016 02:29 PM IST
Kane williamson says black caps failed as a batting unit

పర్యాటక జట్టు న్యూజీలాండ్ తో అతిత్య జట్టు టీమిండియాకు మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ లో విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం వేదకగా సాగిన మ్యాచ్ లో ఓటమి పాలై సిరీస్ను కోల్పోవడంపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ బ్యాటింగ్ పూర్తి స్థాయిలో నిరాశపరిచిన కారణంగా దారుణమైన ఓటమిని ఎదుర్కొన్నమన్నాడు. ఇది కాస్త టర్నింగ్ ట్రాక్ అయినప్పటికీ, 16 పరుగుల వ్యవధిలో 8 వికెట్లను కోల్పోవడం గేమ్కు తమ ఆటగాళ్లు చేసిన న్యాయంగా భావించడం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ ఓటమి తమకు అనేక గుణపాఠాలను నేర్పుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.

'గత పిచ్ల కంటే ఈ పిచ్ కాస్త భిన్నంగా ఉంది. ఇక్కడ బంతి ఎక్కువ టర్న్ అయ్యింది. దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో మా జట్టు పూర్తిగా వైఫల్యం చెందింది. ఇలా దారుణంగా ఓడి పోవడం చాలా బాధాకరం. ఈ తరహా ఓటమి నుంచి తిరిగి జట్టును చక్కదిద్దుకోవడానికి ఆస్కారం దొరకుతుంది. ఐదో వన్డేకు ముందు టీమిండియాను ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలు రచించాం. అయితే మా బ్యాటింగ్ పూర్తిగా నిరాశ పరిచింది. మేము దారుణంగా ఆడటం వల్లే మూల్యం చెల్లించుకున్నాం. భారత్ కచ్చితంగా మంచి జట్టే. ఈ సిరీస్లో వారు నిలకడైన ప్రదర్శన చేసి సిరీస్ సాధించారు. వారు సిరీస్ సాధించడానికి అర్హులు. ఇక్కడ క్షమాపణ ఏమీ లేదు 'అని విలియమ్సన్ స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kane Williamson  new zealand  ind vs nzl  Team India  Cricket  

Other Articles