అసీస్ మాజీ ఫాస్ట్ బౌటర్ కన్నుమూత Former Australian cricketer Max Walker passes away

Former australian cricketer max walker passes away

max walker, max walker dies, max walker australia, australia, former crickter, max walker, former australian bowler, max walker age, max walker family, max walker death, cricket australia, cricket, cricket news, sports

Former Australia bowler Max Walker, After retiring became a commentator, a popular raconteur and a best-selling author whose books included How To Hypnotise Chooks, Other Great Yarns.

అసీస్ మాజీ ఫాస్ట్ బౌటర్ ‘‘టాంగిల్స్’’ కన్నుమూత

Posted: 09/28/2016 07:16 PM IST
Former australian cricketer max walker passes away

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మ్యాక్స్ వాల్కర్ (68) ఇవాళ పరమపదించారు. అసీస్ క్రికెట్ కు 70వ దశకంలో సేవలందించిన ఆయన ఇవాళ కన్నుమూశారని అస్ట్రేలియా క్రికెట్ బోర్డు వెల్లడించింది. గత రెండేళ్లుగా కేన్సర్ వ్యాధిబారిన పడిన ఆయన చికిత్స కూడా చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా తీవ్ర ప్రభావం చూసిన స్కిన్  కేన్సర్ ఇవాళ ఆయన ప్రాణాలను హరించివేసింది. దీంతో వ్యాధిబారిన పడిన వాల్కర్ మరణించినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఆయన విభిన్నమైన బంతులను విసిరినందుకు గాను అయనను తన సహచరులతో పాటు ఇతర దేశ క్రీడాకారులు కూడా టాంజీల్స్ అని ముద్దుగా పిలచేవారు.

1972-77 మధ్యకాలంలో వాల్కర్ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. 34 టెస్టులాడిన వాల్కర్ సగటున 27.47 తో 138 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు ఆరు పర్యాయాలు ఐదేసి వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అత్యుత్తమంగా ఇంగ్లండ్తో మ్యాచ్లో 8 వికెట్లు తీశాడు. ఇక ఆసీస్ తరపున వాల్కర్ 17 వన్డేలు ఆడాడు. 1981లో న్యూజిలాండ్తో జరిగిన చివరి వన్డే అతనికి ఆఖరి మ్యాచ్. బ్యాట్స్ మెన్ గా కూడా వాల్కర్ మంచి సగటునే నమోదు చేశాడు. తన కెరీర్ లో మొత్తంగా 19.53 సగటున 586 పరుగులు సాధించాడు.

ఇక తన కెరీర్ బెస్ట్ గా ఇంగ్లాండ్ తో ఓవల్ లో జరిగిన మ్యాచ్ లో ఆయన ఏకంగా 78 పరుగులు సాధించి.. నాటౌట్ గా కూడా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తరువాత ఆయన కామెంటేటర్ గా, హస్య రచయితగా కూడా పేరు సాధించారు. ఆయన రాసిని పుస్తకాలు అస్ట్రేలియాతో పాటు పలు దేశాలలో విరివిగా అమ్మాకాలు సాగించాయి, 2011 నుంచి ఆయన సామాజిక కార్యకర్తగా కూడా తన దేశానికి సేవలందించారు. వాల్కర్ మృతిపట్ల క్రికెట్ ఆస్ట్రేలియా సంతాపం ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : australia  former crickter  max walker  former australian bowler  cricket  

Other Articles