Birthday boy Ishant Sharma falls prey to witty Sehwag on Twitter

Birthday boy ishant sharma falls prey to witty sehwag on twitter

virendra sehwag, ishant sharma, ishant sharma birthday, virendra sehwag has funny names for ishant, indian bowler ishant sharma, indian cricket team, team india wishes happy birthday to ishant, cricket news, Cricket, Sport

Known for his amusing and witty tweets, Virender Sehwag carried on his tradition of wishing his teammates on Twitter, in his trademark style.

బుర్జ్ ఖలీఫాకు వీరూ జన్మదిన శుభాకంక్షలు

Posted: 09/03/2016 04:49 PM IST
Birthday boy ishant sharma falls prey to witty sehwag on twitter

టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ వరుస ట్వీట్లతో తన ఫాలోయర్స్ ను అలరిస్తున్నాడు. తన కెరీర్ లో వున్నంత సేపు అసలు తనకు మాటలే రావన్నట్లుగా వ్యవహరిచిన వీరూ.. తన విరమణ తరువాత సెకెండ్ ఇన్నింగ్స్ గా ఎంచుకున్న ట్విట్టర్ లో మాత్రం దూసుకెళ్తున్నాడు. సోషల్ మీడియాలోనూ దూకుడుగా ఉంటాడని వీరూ నిరూపించాడు. విషయం ఏంటంటే.. టీమిండియా ఆటగాడు ఇషాంత్ శర్మ పుట్టినరోజు. ట్విట్టర్ ద్వారా ఇషాంత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

అయితే వీరూ తన ట్వీట్ లో ఇషాంత్కు కొత్త నిక్ నేమ్ పెట్టాడు. టీమిండియా జట్టులో ఇషాంత్ ఎత్తయిన ఆటగాడు కావడంతో  ప్రపంచంలో ఎత్తైయిన నిర్మాణాలలో ఒకటైన బూర్జ్ ఖలీఫాతో పోల్చాడు. బాల్ వాలే బూర్జ్ ఖలీఫా, శర్మాజీకా లడ్కా అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్ లో ఆటపట్టించాడు. ఇషాంత్ ను ఎంపిక చేసుకుంటే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటారని సెహ్వాగ్ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. ఇక అటు బ్రిటిష్‌ జర్నలిస్టు పీర్స్‌ మోర్గాన్‌ విషయంలోనూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు.

ఇప్పటివరకు క్రికెట్‌లో వరల్డ్‌ కప్‌ గెలువని మీరా (ఇంగ్లండ్‌) మాగురించి మాట్లాడేదని దెప్పిపొడిచాడు. దీంతో రోషం పొడుచుకొచ్చిన మోర్గాన్‌ ఏకంగా సెహ్వాగ్‌కే సవాల్‌ విసిరాడు. ’హాయ్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. ఇండియా మరో ఒలింపిక్స్‌ మెడల్‌ గెలిచేలోపే ఇంగ్లండ్‌ వన్డే వరల్డ్‌ కప్‌ కొడుతోంది. నాతో రూ. 10 లక్షల బెట్టు కాస్తావా’ అని సవాల్‌ చేశాడు. ఈ సవాల్‌ను లైట్‌ తీసుకున్న సెహ్వాగ్‌.. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ప్రముఖ జర్నలిస్ట్‌ ఆర్నబ్ గోస్వామి తన షో 'న్యూస్‌ అవర్‌'లో మోర్గాన్‌పై మాట్లాడమని అడిగారని, కానీ, టీవీలో ప్రసారమయ్యేంత సీన్‌ ఆయనకు లేదని తాను తోసిపుచ్చానని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. సున్నితమైన హాస్యంతో కూడిన ఈ ట్వీట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virender Sehwag  Ishant Sharma  twitter  nick name  Team India  cricket  

Other Articles