When hotel guests complained about weird noises coming from Rahul Dravid’s room

Weird noises from dravids room disturbed hotel guests

Rahul Dravid, India, Hyderabadi fan, India A, cricket video, What The Duck, Vikram Sathaye, rahul, cricket, indian cricket team, fans, funny, bizarre, shocked, cricket news

hotel guests used to complain, people who were specially living next to your room that weird noises would come out of Rahul Dravid’s room says cricket humourist Vikram Sathaye.

రాహుల్ ద్రావిడ్ గది నుంచి శబ్దాలపై పిర్యాదు..

Posted: 07/18/2016 05:43 PM IST
Weird noises from dravids room disturbed hotel guests

టీమిండియాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న స్టార్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్. ఇటీవల తన జీవితంలో ఒక హైదరాబాదీ అభిమాని సృష్టించిన సంఘలన గురించి చెప్పిన ఆయన తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలను క్రికెట్ హ్యూమరిస్ట్ విక్రమ్ సత్యాయితో వాట్ ద డక్ షోలో పంచుకున్నాడు. ద్రావిడ్ ఒకరోజు హోటల్‌లో రూమ్‌తీసుకుని ఒంటరిగా ఉన్నాడట.  ద్రావిడ్‌ రూమ్ నుంచి పెద్దపెద్ద శబ్దాలు వస్తున్నాయని పక్క రూమ్ వాళ్లు హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారట.

రూమ్‌ నుంచి శబ్దాలు వస్తున్నాయని, తమ నిద్రకు భంగం కలిగిందని వారు ద్రావిడ్‌పై ఫిర్యాదు చేశారు. ద్రావిడ్ దగ్గరకు వెళ్లి హోటల్ అఫిషియల్స్ వెళ్లి ప్రశ్నించగా తనకు నిద్రపట్టకపోవడంతో బ్యాట్‌తో ప్రాక్టీస్ చేస్తున్నానని... బ్యాట్‌తో ఫ్లోర్‌పై కొట్టడం వల్ల శబ్దం వచ్చి ఉంటుందని ద్రావిడ్ చెప్పాడు. తన ప్రాక్టీస్ ఇతరులను ఇలా ఇబ్బంది పెడుతుందని అనుకోలేదని ద్రావిడ్ వివరణ ఇచ్చుకున్నాడట. ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ ద్రావిడ్ కెరీర్‌లో చాలానే ఉన్నాయట. మరెన్ని ఎప్పుడ మనకు అందుబాటులోకి వస్తాయో వేచిచూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Dravid  India  What The Duck'  Vikram Sathaye  Hyderabadi fan  cricket  

Other Articles