CA bans three local players for cricket betting

Players banned for gambling breach

Australia cricket board, Hayley Jensen, Corinne Hall, Ban on 2 women Players, Cricket Australia, Jensen, aus vs nzl, mens team, brisbane, zero tolerance, national women's league,

Cricket Australia has banned two players and sla pped a suspended ban on a third for breaching its Anti-Corruption Code and betting on cricket.

బెట్టింగ్ కు పాల్పడిన అసిస్ క్రికెటర్లపై వేటు..

Posted: 07/06/2016 08:19 PM IST
Players banned for gambling breach

బెట్టింగ్ అరోపణలు మరో మారు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును కుదిపేశాయి. ఇప్పటి వరకు కేవలం క్రికెట్ లో బెట్టింగ్ అరోపణలు ఎదుర్కొని కేవలం పురుష క్రికెటర్లు మాత్రమే పలు చర్యలకు గురయ్యారు, తాజాగా ఈ బెట్టింగ్ ఇటు మహిళా క్రికెట్ లోకి చోచ్చుకెళ్లింది. బెట్టింగ్ కు పాల్పడ్డారన్న అరోపణలపై అస్ట్రేలియాకు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లపై వేటు ప‌డింది. బెట్టింగ్ కు పాల్ప‌డిన త‌మ దేశ మహిళా క్రికెటర్లు హేలీ జెన్సెన్, కొరిన్నె హల్లపై మొద‌ట‌ రెండేళ్ల నిషేధం విధించిన‌ క్రికెట్ ఆస్ట్రేలియా.. తర్వాత ఆ నిషేధాన్ని 18 నెలలు తగ్గించింది.

దీంతో వారిరువురిపై 6 నెల‌ల చొప్పున నిషేధం కొన‌సాగ‌నుంది. గతేడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పురుషుల‌ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య టెస్టు మ్యాచులు జ‌రుగుతోన్న సమ‌యంలో హేలీ జెన్సెన్, కొరిన్నె హల్ల టెస్ట్‌ మ్యాచ్పై బెట్టింగ్ క‌ట్టారు. ఈ విష‌యాన్ని జెన్సెన్ ఒప్పుకుంది. అంతేకాక వీరు పురుషుల దేశవాళీ వన్డే క్రికెట్ మ్యాచ్లు జ‌రుగుతోన్న సంద‌ర్భంగా కూడా బెట్టింగ్‌కు పాల్ప‌డ్డారు. ఈ విష‌యాన్ని హల్ ఒప్పుకుంది. దీంతో ఇక వీరు 6 నెల‌ల నిషేధం ఎదుర్కోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia cricket board  Hayley Jensen  Corinne Hall  Ban on 2 women Players  

Other Articles