ICC admits fixing draws to put India and Pakistan in same group

Icc admits fixing draws to put india and pakistan in same group

india v pakistan, icc champions trophy, champions trophy 2017 schedule, india pakistan draw fixing, india, pakistan, australia, new_zealand, south_africa, bangladesh, sri_lanka, england, icc_champions_trophy_2017, cricket

The International Cricket Council admitted that the draws for world tournaments are usually fixed to get India and Pakistan into the same group.

ధాయాధుల పోరుతో క్రికెట్ కు కిక్కు.. అందుకనే అలా చేశాం..

Posted: 06/02/2016 01:21 PM IST
Icc admits fixing draws to put india and pakistan in same group

ప్రపంచకప్ టోర్నమెంటులో టాప్ ఎనమిది జట్ల మధ్య వచ్చే ఏడాది జూన్ లో జరగనున్న ఛాంఫియన్స్ ట్రాఫీలో, అభిమానులు ఎంచక్కా అస్వాధించేందుకు, కిక్కును పంచడం కోసమే తాము కావాలనే కొన్ని జట్లను ఒకే పూల్ లో వేసినట్ల ఐసీపీ సీఈవో డేవ్ రిచర్డ్ సన్ అంగీకరించారు. అయితే దీని పట్ల సంప్రాదాయ క్రికెట్ కు రానున్న కాలంలో బీటాలు వారుతాయన్న వాదననలను అయన తోసిపుచ్చారు. గ్రూపుల్లో ఉన్న దేశాల ర్యాంకులను కలిపి చూస్తే.. రెండు గ్రూపుల పాయింట్లు సమానంగా ఉన్నాయన్నారు. రెండింటి మధ్య సరితూకం ఉన్నంతవరకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్పారు.

ముఖ్యంగా క్రికెట్ లో ధాయాదులుగా అభివర్ణించబడే జట్లు.. టీమిండియా, పాకిస్థాన్.. అటు ఇంగ్లాండ్ అస్ట్రేలియాలను ఒకే పూల్ లో వేశామని తెలిపారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో దానిని వీక్షించడానికి యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులు అసక్తి చూపుతారని, గత వరల్డ్ కప్ లో ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సుమారుగా 100 కోట్ల మంది టీవీలకు హత్తుకుపోయారన్న విషయాన్ని మర్చిపోరాదని, అందుకనే తాము కావాలనే ఈ రెండు జట్లను ఒకే గ్రూపులో ఉండేలా డ్రాలను కొద్దిగా అటూ ఇటూ చేస్తున్నట్లు సాక్షాత్తు ఆయన చెప్పారు.  

2017లో ఇంగ్లండ్‌లో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీలో భారత, పాక్ జట్ల మధ్యనే తొలి మ్యాచ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. సుమారు ఏడాది తర్వాత.. జూన్ 4వ తేదీన ఎడ్జ్‌బాస్టన్‌లో ఈ మ్యాచ్ ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు ఉండేలా చూడాలనే తాము ప్రయత్నిస్తామని, అందులో అనుమానం అక్కర్లేదని చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారని, అలాంటి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమైతే మంచి కిక్ వస్తుందని ఆయన అన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india v pakistan  icc champions trophy  Australia  England  dave richardson  

Other Articles