Childhood Coach Backs Virat to Break Sachin's Records

Virat kohli can break sachin tendulkar s records

Virat Kohli,Indian Premier League,IPL 2016,Rajkumar Sharma,Sachin Tendulkar,Royal Challengers Bangalore, ipl, cricket news

Virat Kohli, who has been in sensational form this season, finished as the highest run-getter in the recently-concluded IPL season nine besides smashing a record four centuries.

అతడు సచిన్ రికార్డుల దుమ్ము దులుపుతాడు..

Posted: 06/02/2016 12:52 PM IST
Virat kohli can break sachin tendulkar s records

టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన పేరున నమోదు చేసుకున్న రికార్డులన్నింటినీ దుమ్ము దులిపి తన పేరున లిఖించుకునేందుకు విరాట్ కోహ్లీ సిద్దంగా వున్నాడని విరాట్ కోహ్లీ చిన్నానాటి క్రికెట్ కోచ్ రాజ్ కుమార్ శర్మ అభిప్రాయపడ్డారు. అటు టీ20 వరల్డ్‌ కప్‌లోనూ, ఇటు ఐపీఎల్‌లోనూ అద్భుతమైన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించిన డాషింగ్ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి.. సచిన్‌ రికార్డులన్నీ బద్దలుకొడతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.

కోహ్లి బ్యాటింగ్‌ తీరులో ఎలాంటి లోపంకానీ, బలహీనతకానీ లేదని, కాబట్టి అతడు సచిన్‌ రికార్డులను తప్పకుండా అందుకుంటాడని ఆయన పేర్కొన్నారు. 'కోహ్లి ఇప్పుడు అత్యున్నతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతని తరహాలో భారత్‌ జట్టులో స్థిరంగా ఆడిన ఆటగాళ్లు గతంలో ఉన్నట్టు నాకైతే గుర్తులేదు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఏ కొద్దిమంది మాత్రమే కోహ్లి తరహాలో స్థిరత్వాన్ని ప్రదర్శించారు. అతని బ్యాటింగ్ తీరు  చూస్తుంటే.. అతడు తప్పకుండా సచిన్ రికార్డులు బ్రేక్ చేస్తాడని అనిపిస్తోంది' అని శర్మ తాజాగా మీడియాకు తెలిపారు.

'తన సామర్థ్యం తనకున్న అపారమైన విశ్వాసమే కోహ్లిని ఇతర బ్యాట్స్‌మెన్‌ నుంచి వేరు చేస్తుంది. అతను తనను తాను నమ్ముతాడు. ప్రత్యర్థి జట్టును, పరిస్థితులను బట్టి ఆటతీరు కనబరుస్తాడు. ఈ సమయానుకూల ధోరణే అతని విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నది. అంతేకాకుండా కోహ్లికి పరుగుల దాహం ఎక్కువ. 2014లో జరిగిన ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైనా.. ఆ వెంటనే జరిగిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో నాలుగు సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత టీ-20 వరల్డ్‌కప్‌లోనూ, ఐపీఎల్‌లోనూ హర్డ్‌ వర్క్‌తో తానెంటో కోహ్లి నిరూపించుకున్నాడు' అని రాజ్‌కుమార్‌ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Sachin Tendulkar  coach Rajkumar Sharma  ipl  cricket news  

Other Articles