Yuvraj Singh finally realises his dream of winning the title, after eight barren years

Yuvraj becomes the 1st player to win three world cups

IPL 2016 Final,Yuvraj Singh,srh,yuvraj reaction,Sunrisers Hyderabad,yuvraj ipl 2016 stats,Sunrisers Hyderabad IPL 2016 Champions,RCB vs SRH,ipl final,David Warner,srh bowlers

Eight years Yuvraj Singh went without making the IPL final, and with the left-hander shifting teams after every season in the recent past, it looked like the chance to have a crack at the IPL title might elude him.

టైటిల్ విజయాన్ని అతనికి అంకితం చేసిన యవరాజ్

Posted: 05/30/2016 02:00 PM IST
Yuvraj becomes the 1st player to win three world cups

టీమ్ ఇండియా ఆల్ రౌండర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యువరాజ్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్... ఐపీఎల్-9 టైటిల్ దక్కించుకోవడంలో తనవంతు పాత్ర పోషించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన ఫైనల్లో యువరాజ్ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. ఫీల్డింగ్ లోనూ మెరుపులు మెరిపించాడు. గత ఎనమిది పర్యాయాలుగా ఐపీఎల్ లో అడుతున్న ఒక్కసారి కూడా తన జట్టు ఫైనల్ లో గెలుపోందకపోవడంతో ఆయన ఇక ఐపీఎల్ కు దూరమవుతారన్న వార్తలు కూడా వచ్చాయి.

అంతేకాదు ఈ ఎనమిదేళ్ల కాలంలో అయన పలు జట్ల తరపున ప్రాతినిధ్యం వహించాడు. అయినా తాను ప్రాతినిధ్యం వహించిన ఏ ఒక్క జట్టు తాను కొనసాగుతుండగా కప్ సాధించలేకపోయింది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారని కూడా సమాచారం. అయితే ఈ సారి మాత్రం తమ జట్టుకు ఐపీఎల్ టైటిల్ దక్కడంతో యువీ అనందానికి హద్దులు లేకుండా పోయాయి. చూడటానికి గంభీరంగా కనిపించే యువరాజ్.. మనస్సు మాత్రం సుతిమత్తన అని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ.

తన ఆనంద సమయంలో కూడా సహచర ఆటగాళ్లను మర్చిపోరనడానికి కారణం కూడా ఇది. సన్ రైజర్స్ కీలక బౌలర్ అశీష్ నెహ్రా మంచి ఫామ్ లో కొనసాగుతూ పరుగులను కట్టడి చేస్తూనే 8 మ్యాచులలో 9 విక్కెట్లను సాధించాడు. 8 పరుగల ఎకానమీతో ఆయన ఈ ఘనత సాధించి.. గాయం బారిన పడ్డాడు. మే 15న జరిగిన మ్యాచ్ లో గాయపడిన ఆయన వైద్యుల సూచనల మేరకు ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. లండన్ కు చెందిన అర్థోపెడిక్ స్పెషలిస్టు వైద్యుడు డాక్టర్ అండ్రీవ్ విలియమ్స్ ను అయన కలుసుకున్నాడు.

దీంతో ఆయనకు గత మంగళవారం శస్త్ర చికిత్స చేశారు. మ్యాచ్ గెలిచిన సందర్భంగా యువరాజ్.. ఈ గెలుపును నెహ్రాజీకి అంకితమిస్తున్నామని తన ఇస్టాగ్రామ్ లో పేర్కోన్నాడు. అంతేకాదు ఈ గెలుపుతో యువరాజ్ అరుదైన రికార్డ్ సొంతమైంది. వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ, అండర్-19 వరల్డ్ కప్, ఐపీఎల్ టైటిల్స్ దక్కించుకున్న టీమ్స్ లో సభ్యుడిగా ఉన్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 2011 వన్డే వరల్డ్ కప్ లో అద్భుత ఆల్ రౌండ్ ప్రదర్శనతో 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా సత్తా చాటాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2016 Final  Yuvraj Singh  winning team member  sun risers hyderabad  cricket  

Other Articles