sun risers emerges as IPL 2016 champions beatin banglore by 8 runs

Sunrisers hyderabad beat royal challengers to win ipl 2016

ipl 2016, ipl, ipl play-offs, ipl final, david warner, david warner srh, david warner hyderabad, srh david warner, srh vs gl, gujarat hyderabad, sunrisers Hyderabad, Gujarat Lions, SRH vs GL, hyderabad, Qualifier 2,IPL 9,Cricket latest IPL 9 news

Royal Challengers Bangalore (RCB) lost out to Sunrisers Hyderabd (SRH) by eight runs in a dramatic final of the Indian Premier League (IPL) Season Nine at the Chinnaswami Stadium

ఐపీఎల్ 9 ఛాంపియన్స్ సన్ రైజర్స్.. తొలిసారి చారిత్రాత్మక విజయం

Posted: 05/30/2016 12:48 PM IST
Sunrisers hyderabad beat royal challengers to win ipl 2016

ఐపీఎల్‌-సీజన్ 9 ఛాంపియన్ గా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలిసారిగా అవరతరించింది. తుది పోరులో హాట్ ఫేవరట్ కాకపోయినా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై చారిత్రాత్మక విజయం సాధించింది. ఫైనల్ కు చేరిన వార్నర్ సేన అనుకున్న విధంగానే సమర్ధవంతమైన గేమ్ ప్లాన్ ను అమలు చేసి అందరి అంచానాలను తలకిందులు చేస్తూ విజేతగా నిలిచింది. బెంగుళూరు సొంత గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం కావడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని భావించిన బెంగుళూరు షాకిచ్చింది. అటు కోహ్లి, డివిలియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్ వంటి విధ్వంసరకర బ్యాట్సమెన్లు ఫామ్లో కోనసాగుతున్నా.. ఎలాంటి కీలక బ్యాట్స్ మెన్లు లేని వార్నర్ సేన వారిని చిత్తు చేసి టైటిల్ ను సాధించింది.

మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 209 పరుగులు భారీ లక్ష్యాన్ని బెంగలూరు రాయల్ చాలెంజర్స్ జట్టుముందుంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు కెప్టెన్ వార్నర్, శిఖర్ ధావన్ తో కలిసి రంగంలోకి దిగి పరుగుల వరద పారించారు. వార్నర్ 39 బంతులకు 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 69 పరుగులు చేసాడు. శిఖర్ ధావన్ 23 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో 28 పరుగులు చేసి శుభారంభమిచ్చారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం వల్ల పవర్ ప్లే సెషన్లో వికెట్ కోల్పోకుండా 59 పరుగులను జట్టు నమోదుచేయగలిగింది. తరువాత వచ్చిన హెన్రీక్యూస్ నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. తరువాత యువరాజ్ సింగ్ రావడంతో మళ్లీ పరుగుల దాటి పెరిగింది. మొత్తం ఏడు వికెట్లను కోల్పోయి 208 పరుగులు చేసింది.

209 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన బెంగలూరు జట్టు తొలుత బాగానే ఆడినట్లు కనిపించింది. ఓపెనర్లుగా రంగంలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ భాగస్వామ్యంలో 130 పరుగుల భారీ స్కోర్ నమోదయింది. కానీ తరువాత వచ్చిన ఆటగాళ్లు సన్ రైజర్స్ బౌలర్ల ముందు తేలిపోయారు. గేల్ 38 బంతుల్లో 76 పరుగులు, కోహ్లీ 35 బంతుల్లో 54 పరుగులు చేసారు. డివిలియర్స్‌ (5), కేఎల్‌ రాహుల్‌ (11), వాట్సన్‌ (11), బిన్నీ (9) ఇలా వరుసగా పెవిలియన్‌ చేరిపోయారు. దీంతో చివర్లో బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది.

సచిన్‌ బేబీ (18 నాటౌట్‌: 10 బంతుల్లో 1x4, 1x6) కాసేపు పోరాడినా అతను బెంగళూరు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు. చివరికి బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. తరువాత వచ్చిన డివిలియర్స్ (5), రాహుల్ (11) వాట్సన్ (11), బిన్నీ (9) చేసి పెవిలియన్ దారిపట్టారు. చివరిగా వచ్చిన సచిన్ బేబీ 18 పరుగులు చేసి అజేయుడిగా నిలిచి పోరాడినా ఫలితం లేకపోయింది. దాంతో నిర్థేశిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగుల వద్ద ఆర్సీబీ తన ఓటమిని అంగీకరించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL-2016  David Warner  Sunrisers Hyderabad  IPL final  Royal Challengers  

Other Articles