Side strain rules Kings XI Punjab batsman Glenn Maxwell out of IPL

Maxwell and stoinis heading home early from ipl

virat kohli, indian premier league, ipl, ipl 2016, ipl 9, Glenn Maxwell, Kings XI Punjab, cricket australia, cricket news, cricket

Kings XI Punjab's Glenn Maxwell on Tuesday became the fifth Australian cricketer to be ruled out of the Indian Premier League (IPL) after the swashbuckling batsman complained of a side strain.

గాయంతో స్వదేశానికి మాక్స్ వెల్ పయనం..

Posted: 05/18/2016 04:22 PM IST
Maxwell and stoinis heading home early from ipl

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కీలక ఆటగాడు మాక్స్ వెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వైదొలగనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం అధికారికంగా వెల్లడించింది. పంజాబ్ ఆల్ రౌండర్ మాక్స్ వెల్ ఎడమ చేతికి గాయమైందని దాంతో అతడు ఇబ్బంది పడుతున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. దీంతో లీగ్ మ్యాచులకు దూరం కానున్నాడు. ఆస్ట్రేలియా జట్టు త్వరలో వెస్టిండీస్ లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో మాక్స్ వెల్ విశ్రాంతి తీసుకుంటేనే జూన్ 5న మొదలయ్యే ఆ టూర్ సమయానికి అతడు ఫిట్ నెస్ గా ఉంటాడని పేర్కొంది.

ఎడమ చేతి గాయం పైకి కనిపించడం లేదని, మాక్స్ వెల్ మాత్రం నొప్పితో బాధ పడుతున్నాడని ఆసీస్ అధికారులు వెల్లడించారు. దీంతో ఐపీల్-9 సీజన్ నుంచి వైదొలగిన 5వ ఆసీస్ క్రికెటర్ అయ్యాడు. గాయాల కారణంగా ఈ ఐపీఎల్ మధ్యలోనే తప్పుకున్న వాళ్లలో ఆసీస్ ఆటగాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. స్టీవ్ స్మిత్, జాన్ హెస్టింగ్స్, షాన్ మార్ష్, మిచెల్ మార్ష్ ఇప్పటికే ఈ టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL-2016  Glenn Maxwell  Kings XI Punjab  cricket australia  Cricket  

Other Articles

Today on Telugu Wishesh