Rahul Dravid would make a very good coach of India:Ricky Ponting

Ricky ponting backs rahul dravid for team india coaching job

Cricket, Ricky Ponting, Board of Control for Cricket in India (BCCI), Mumbai Indians (MI), Rahul Dravid, Jasprit Bumrah, IPL 2016, IPL 9, Indian Premier League (IPL)

Former Australia captain Ricky Ponting said he would love to coach the Indian team, but added that he is more comfortable in his role now as coach of IPL franchise Mumbai Indians.

టీమిండియా కోచ్ గా ద్రావిడే కరెక్టు వ్యక్తి

Posted: 05/18/2016 03:50 PM IST
Ricky ponting backs rahul dravid for team india coaching job

టీమిండియా ది వాల్ గా పేరోందిన మిస్టర్ ఢిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కు ఇది నిజంగా కలిసోచ్చిన కాలం. ఆయన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా పగ్గాలు చేపట్టినా రానీ అదరణ, ప్రోత్సహం ఇప్పుడాయనకు కలిసోస్తుంది, టీమిండియా ఎ జట్టు, అండర్ 19 జట్లకు కోచ్ గా వ్యవహరిస్తున్న ఆయనకు ఇటీవలే మరో కీలక పదవి కూడా చేరింది, అదే అంతర్జాతీయ క్రికెట్ మండలి క్రికెట్ కమిటీలో సభ్యుడిగా కూడా ఆయన చేరిపోయారు.

అయితే ఇదే సమయంలో ఆయనపై ఏకంగా అస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ కూడా ప్రశంసలు కురిపించారు. అంతేకాదు భారత క్రికెట్ కోచింగ్ పగ్గాలు చేపట్టడానికి రాహుల్ ద్రవిడ్ సరైన వ్యక్తి అని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా కోచింగ్కు ఉన్న ఆప్షన్లలో ద్రవిడే అత్యుత్తమని రికీ పేర్కొన్నాడు. 'క్రికెట్ పరంగా ద్రవిడ్కు విపరీతమైన నాలెడ్జ్ ఉంది. దాంతోపాటు అతనికి క్రికెటర్ గా అనుభవం కూడా ఎక్కువే.

ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీకి కోచ్గా చేస్తున్న ద్రవిడ్కు మూడు ఫార్మాట్లపై మంచి అవగాహన ఉంది. అతను కచ్చితంగా భారత్కు మంచి కోచ్ కాగలడని నా అభిప్రాయం'అని రికీ తెలిపాడు. అయితే కోచ్ గా ఎవర్నీ నియమించాలనేది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)నిర్ణయంపై ఆధారపడి వుంటుందన్నాడు. దాంతో పాటు కెప్టెన్ నిర్ణయం కూడా కోచ్ల ఎంపిక విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుందని రికీ పేర్కొన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul dravid  coach  india  IPL  delhi dare devils  

Other Articles