Syed Mushtaq Ali Trophy 2015-16: Ishwar Pandey ensures Madhya Pradesh thrash Andhra by 5 wickets

Ishwar pandey claims hat trick

andhra,andhra vs madhya pradesh,andhra vs madhya pradesh 2015-16,india,ishwar pandey,madhya pradesh,madhya pradesh vs andhra,madhya pradesh vs andhra 2015-16,syed mushtaq ai trophy,syed mushtaq ai trophy 2015-16

Ishwar Pandey ripped apart the rival top-order with a four-wicket haul as Madhya Pradesh overwhelmed Andhra Pradesh by five wickets

మధ్యప్రదేశ్ స్విన్నర్ ఈశ్వర్ పాండే అద్బుత హ్యాట్రిక్

Posted: 01/02/2016 08:40 PM IST
Ishwar pandey claims hat trick

ముస్తాక్ అలీ ట్వంటీ 20 ట్రోఫీలో మధ్యప్రదేశ్ పేస్ బౌలర్ ఈశ్వర్ పాండే హ్యాట్రిక్ నమోదు చేశాడు. గ్రూప్-సిలో భాగంగా ఆంధ్రతో జరిగిన మ్యాచ్ లో పాండే ఈ ఘనతను అందుకున్నాడు. ఆంధ్ర  కోల్పోయిన తొలి మూడు వికెట్లను పాండే తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ సాధించాడు.మూడో ఓవర్ ను అందుకున్న పాండే ఆ ఓవర్ మూడో బంతికి ఆంధ్ర కెప్టెన్ భరత్(9) ను పెవిలియన్ కు పంపగా, ఆ తరువాత వరుస బంతుల్లో ప్రశాంత్ , శ్రీకాంత్లను అవుట్ చేసి హ్యాట్రిక్ తో ఆకట్టుకున్నాడు.  ఓవరాల్ గా 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను సాధించిన పాండే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

వడోదరలోని రిలయన్స్ స్టేడియంలో మధ్యప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లోతొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఆంధ్ర టాపార్డర్ లో భరత్(9),ప్రశాంత్(3), శ్రీకాంత్(9), ప్రదీప్(0), అశ్విన్ హెబర్(15) ఘోరంగా విఫలం చెందడంతో జట్టు వంద మార్కులు అంకెను కూడా చేరలేదు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన మధ్యప్రదేశ్ 18.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. మధ్యప్రదేశ్ ఆటగాళ్లలో హర్ ప్రీత్ సింగ్(40 నాటౌట్) రాణించగా, సహాని(22), ధలివాల్(25 నాటౌట్)లు విజయంలో సహకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ishwar Pandey  hat trick  syed mushtaq ali trophy  

Other Articles