Afghanistan enter top 10 in ODI cricket rankings

Afghanistan break into top 10 of odi rankings

afghanistan, icc ramkings, zimbamwe, icc one day rankings, afghanistan icc rankings, Smarting Zimbabwe seek recovery and parity, Hamza, Nabi help Afghanistan defend 131, Afghanistan cricket

Afghanistan's 49-run win in the first ODI against Zimbabwe in Sharjah on Friday meant they displaced Zimbabwe to enter the top 10 in the ICC ODI charts for the first time.

ఐసీసీ టాప్ టెన్ లోకి తొలిసారిగా అఫ్ఘనిస్థాన్

Posted: 12/28/2015 08:04 PM IST
Afghanistan break into top 10 of odi rankings

పసికూన ఆఫ్ఘనిస్తాన్ వన్డేల్లో తొలిసారి టాప్ -10 లో చోటు సంపాదించింది. గత నాలుగు రోజుల క్రితం జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో 49 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆప్ఘనిస్తాన్ తన ర్యాంకును కూడా మరింత మెరుగుపరుచుకుంది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ రెండు ర్యాంకులు పైకి ఎగబాకి 10 ర్యాంకుకు చేరింది.
 
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఆప్థనిస్తాన్ మొదటిసారి టాప్ టెన్ లో స్థానం సంపాదించగా, జింబాబ్వే మరింత కిందికి పడిపోయింది.   ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్  ను ఆప్ఘనిస్తాన్ కైవసం చేసుకుంటే 10వ ర్యాంకు పదిలంగా ఉంటుంది. ఒకవేళ సిరీస్ ను కోల్పోయిన పక్షంలో తిరిగి  12 వ ర్యాంకుకు చేరుతుంది. ఆప్ఘనిస్తాన్ తరువాతి స్థానాల్లో ఐర్లాండ్, జింబాబ్వేలు నిలిచాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : afghanistan  icc ramkings  zimbamwe  icc one day rankings  

Other Articles