India's Shikhar Dhawan reported for illegal bowling action

Dhawan reported for suspect bowling action

Shikhar Dhawan, bowling action, illegal, India, South Africa, India vs South Africa, Delhi, feroz shah kotla stadium, international cricket councel, shikar dhawam suspect action, shikar dhawam bowling action

India batsman Shikhar Dhawan, who bowls part-time offspin, has been reported for a suspect action after the fourth Test against South Africa in Delhi

శిఖర్ ధావన్ బౌలింగ్ పై సఫారీల పిర్యాదు

Posted: 12/09/2015 05:52 PM IST
Dhawan reported for suspect bowling action

ఇండియన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పై అంతర్జాతీయ క్రికెట్ మండలిలో పిర్యాదు నమోదైంది. ఆయనపై దక్షిణాఫ్రికా బ్యాట్ మెన్లు ఈ ఫిర్యాదును నమోదు చేశారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు శిఖర్ ధావన్ పై ఐసీసీ చర్యలు తీసుకోనుంది. ఇంతకీ శిఖర్ ధావన్ చేసిన పనేమిటి అనేగా..? మీ సందేహం. మూడు రోజుల క్రితం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన శిఖర్ ధావన్ బౌలింగ్ శైలి సరిగ్గా లేదంటూ దక్షిణాఫ్రికా జట్టు ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

ధావన్ వేసిన ఆఫ్ స్పిన్ బంతులు నియమావళికి లోబడి వున్నాయా? లేవా? అన్న విషయమై తమకు సందేహాలున్నాయని వెల్లడించారు. దీనిపై ఐసీసీ విచారించి తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. కాగా, శిఖర్ ధావన్ బౌలింగ్ చేయడం చాలా అరుదు. ఇప్పటివరకూ ఒక రోజు పోటీలు, టీ-20ల్లో బౌలింగ్ వేయని ధావన్, తానాడిన 19 టెస్టుల్లో 9 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. సౌతాఫ్రికా జట్టు నాలుగో టెస్టులో జిడ్డు ఆట ఆడుతున్న వేళ, మూడు ఓవర్లు వేసి 9 పరుగులిచ్చాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shikhar Dhawan  bowling action  illegal  India  South Africa  

Other Articles