Sunil Narine gets backing of West Indies Cricket Board

Wicb to back suspended sunil narine

Sunil Narine, West Indies Cricket Board, Illegal bowling action, ICC, Richard Pybus, sunil narine action, sunil narine illegal action, sunil narine ban, sunil narine banned, sunil narine bowling, sports news, sports

West Indies Cricket Board (WICB) has given Sunil Narine its full backing after the charismatic off-spinner was suspended from bowling in international cricket due to an illegal action.

నరేన్ కు అండగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు

Posted: 12/01/2015 07:28 PM IST
Wicb to back suspended sunil narine

వెస్టిండీస్ మ్యాజిక్ స్పిన్నర్ సునీల్ నరైన్ పై ఐసీసీ సస్పెన్షన్ వేటు విధించిన నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అతనికి అండగా నిలబడింది. ఐసిసి నిబంధనలను అనుసరించి నరేస్ బంతులు విసరడం లేదన్న కారణంగా అతనిని అంతర్జాతీయ క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది. బౌలింగ్ చేస్తున్నప్పుడు మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నాడని పరీక్షల్లో తేలడంతో నరైన్ పై వేటు పడింది. అయితే, నరైన్ కు కష్టకాలంలో అండగా ఉంటామని విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

ట్రినిడాడ్ దేశవాళీ క్రికెట్ లీగ్ ద్వారా నరైన్ తన బౌలింగ్ ను మెరుగు పరుచుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఓ ప్రకటనలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ రిచర్డ్ పైబస్ తెలిపారు. ఇది నరైన్ అంతర్జాతీయ పునరాగమనానికి కచ్చితంగా ఉపయోగ పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మంచి బౌలర్ కావడానికి ఎంతగా కష్టపడ్డారో మాకు తెలుసునని, అయితే, ఇప్పుడు మరోసారి ఆయన తన శాయశక్తులా కష్టపడి ఐసిసి నిబంధనల మేరకు బౌలింగ్ చేయడంలో నిష్ణాతుడు కావాలని తాము బావిస్తున్నట్లు పైబస్ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil Narine  West Indies Cricket Board  Illegal bowling action  ICC  Richard Pybus  

Other Articles