Sunil Gavaskar Supports Mahendra Singh Dhoni By Saying That He Is The Best Finisher Of Match | South Africa vs India Series

Sunil gavaskar supports mahendra singh dhoni best finisher of match south africa india series

Sunil Gavaskar news, Sunil Gavaskar updates, Sunil Gavaskar photos, Sunil Gavaskar gallery, Sunil Gavaskar images, Sunil Gavaskar news, Sunil Gavaskar photo gallery, mahendra singh dhoni, ms dhoni news, india vs south africa

Sunil Gavaskar Supports Mahendra Singh Dhoni Best Finisher Of Match South Africa India Series : Sunil Gavaskar Supports Mahendra Singh Dhoni By Saying That He Is The Best Finisher Of Match.

ధోనీని విమర్శించొద్దు.. ఇప్పటికీ అతనే బెస్ట్!

Posted: 10/12/2015 03:32 PM IST
Sunil gavaskar supports mahendra singh dhoni best finisher of match south africa india series

గతకొన్నాళ్ల నుంచి టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి కాలం కలిసి రావడం లేదు. ఒకప్పుడు అతని సారథ్యంలోనే వరుసగా విజయాలు సాధించిన టీమిండియా.. ఇప్పుడు ఓటములపాలవుతోంది. దీంతో.. ధోనీ మీద కేవలం దేశాభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వుండే ప్రముఖుల నుంచి సైతం విమర్శలు వచ్చిపడుతున్నాయి. అతనిని కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ అభిప్రాయాలూ వెలువడుతున్నాయి. కానీ.. ఈ విమర్శలకు భిన్నంగా ఓ క్రికెట్ లెజెండ్ మాత్రం ధోనీని వెనకేసుకొచ్చాడు. ధోనీ ఇప్పటికే బెస్ట్ అని, అతనిని ఎవరూ విమర్శించొద్దని ఆయన పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా జట్టులో మంచి మ్యాచ్ ఫినిషర్ గా ధోనీకి పేరున్న సంగతి తెలిసిందే! కానీ.. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే చివర్లో పరుగులు రాబట్టడంలో ధోనీ విఫలం అయ్యాడు. దీంతో అతని ఆటతీరుపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. మునుపటిలా ధోనీ తన ప్రతిభను ఎందుకు చాటుకోవడం లేదని ప్రశ్నించడంతోపాటు ఇప్పుడు అతని ప్రతిభ తగ్గిపోయిందంటూ విమర్శలు వచ్చిపడుతున్నాయి. అయితే ధోని మంచి మ్యాచ్ ఫినిషర్ అనే విషయంపై ఎటువంటి అనుమానాలు అక్కర్లేదంటూ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఏదో ఒక మ్యాచ్ లో విఫలమైనంత మాత్రాన ధోనిని విమర్శించాల్సిన అవసరం లేదంటూ ఆ లిటిల్ మాస్టర్ స్పష్టం చేశాడు.

'టీమిండియా నంబర్ వన్ మ్యాచ్ ఫినిషర్ ధోనినే. అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని సందర్భాల్లో మనం సరిగ్గా చేస్తామనుకున్నది చేయడంలో విఫలం అవుతూ ఉంటాం. అది కేవలం క్రీడలకే పరిమితం కాదు.  ప్రతీ రంగంలోనూ జరుగుతూ ఉంటుంది. ఓటమికి కేవలం ధోనిని మాత్రమే బలిపశువును చేయొద్దు' అంటూ గవాస్కర్ హితవు పలికాడు. జట్టులో సమిష్టితత్వం లోపించినప్పుడు ఓటమి సహజంగానే జరుగుతుందని గవాస్కర్  పేర్కొన్నాడు. భారత క్రికెట్ జట్టులో ఇంకా ఏదైనా మెరుగు పడాల్సిన  అవసరం ఉందనుకుంటే అది బౌలింగ్ లోమాత్రమేనని ఈ మాజీ లెజెండ్ తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil Gavaskar  mahendra singh dhoni  india vs south africa  

Other Articles