vinod kambli in legal trouble for allegedly beating abusing domestic help

Fir against vinod kambli wife over maid s complaint

vinod kambli, vinod kambli india, vinod kambli india cricketer, andrea, domestic help, wages, violence agianst domestic help, vinod kambli sachin tendulkar, sachin tendulkar vinod kambli, cricket news, cricket

Vinod Kambli's maid alleged that the couple had confined her for three days when she asked for her wages.

ఆ క్రికెటర్ దంపతులపై కేసు నమోదు

Posted: 08/30/2015 07:09 PM IST
Fir against vinod kambli wife over maid s complaint

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లితో మరోసారి వార్తల్లో నిలిచాడు. అడపాదడపా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనో, లేక తనదైన వైఖరితోనే వార్తల్లో నిలిచే కాంబ్లి ఈ సారి న్యాయపరమైన చిక్కులు కొనితెచ్చుకున్నాడు. తన ఇంట్లో పనిచేసే పనిమనిషిపై దాడి చేసి వేధింపులకు పాల్పర్డారనే ఆరోపణలతో కాంబ్లి, ఆయన సతీమణి ఆండ్రియాపై పోలీసులు కేసు నమోదు చేశారు. పనిమనిషి ఇచ్చిన పిర్యాదు మేరకు ముంబైలోని బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు.

జీతం అడినందుకు తనపై కాంబ్లి, ఆయన భార్య దాడి చేశారని కాంబ్లీ ఇంటి పనిమనిషి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. తనను మూడు రోజుల పాటు చీకటి గదిలో బంధించారని చెప్పింది. మళ్లీ తమ ఇంటి దరిదాపుల్లో కనబడొద్దని హెచ్చరించి విడిచిపెట్టారని వెల్లడించింది. తనకు రెండేళ్లుగా జీతం ఇవ్వం లేదని తెలిపింది. కాంబ్లి ఇంట్లో పనిచేస్తున్నా అక్కడే ఉంటున్నట్టు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కాంబ్లి, ఆండ్రియాలపై ఐపీసీ సెక్షన్ 342, 504, 506, 34 కింద కేసులు నమోదు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vinod kamli  andrea  domestic help  wages  violence agianst domestic help  

Other Articles

Today on Telugu Wishesh