sourav ganguly said that he dont yet know his role in advisory committee | sachin tendulkar

Sourav ganguly role bcci advisory committee controversy

sourav ganguly, sachin tendulkar, bcci advisory committee, vvs laxman, sourav ganguly controversies, sourav ganguly advisory role, bcci advisory committee, sachin tendulkar controversies

sourav ganguly role bcci advisory committee controversy : He is still not clear about his role in the BCCI's newly-constituted advisory committee, but former India cricket captain Sourav Ganguly on Monday said he is happy to be clubbed with Sachin Tendulkar and VVS Laxman in the panel.

నా గురించి నాకే తెలీదు.. ఇంకా మీకేం చెబుతాను?

Posted: 06/01/2015 07:37 PM IST
Sourav ganguly role bcci advisory committee controversy

బీసీసీఐ కొత్తగా ఏర్పాటు చేసిన సలహా కమిటీలో కొందరు మాజీ క్రికెటర్లను ఎంపిక చేసుకుంది. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లతోపాటు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా వున్నారు. దీంతో ఆ కమిటీలో ఈయన పాత్ర ఏమిటోనన్న వ్యవహారంపై ప్రశ్నలు లేవనెత్తాయి. గతకొన్నాళ్ల నుంచి ఈయన టీమిండియా కోచ్ గాగానీ, డైరెక్టర్ గా గానీ ఎన్నికయ్యే అవకాశమున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! ఈ క్రమంలోనే సలహా కమిటీలో ఎంపికవడంతో ఆయన స్థానమేంటోనన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే గంగూలీని సలహా కమిటీలో తన పాత్రేంటో తెలియపరచాల్సిందిగా ప్రశ్నిస్తే.. ‘ఆ విషయంపై ఇంకా క్లారిటీ లేదు.. ఇంకా మీకేం చెబుతాను?’ అంటూ సమాధానమిచ్చాడు.

బీసీసీఐ సలహా కమిటీలో ఎంపికైన అనంతరం గంగూలీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగానే ఓ మీడియా వ్యక్తి ‘కమిటీలో మీ పాత్రేంటి?’ అని ప్రశ్నించాడు. అందుకు గంగూలీ సమాధానమిస్తూ.. ‘కొత్తగా ఏర్పాటు చేసిన సలహా కమిటీలో నా పాత్ర ఏమిటో ఇంకా తెలియదు’ అని అన్నాడు. అయితే.. సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి దిగ్గజ క్రికెటర్లతో కలిసి పనిచేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ‘సలహా కమిటీలో స్థానం లభించిందని ఇప్పుడే తెలిసింది. మిగతా వివరాలేవీ ఇంకా తెలియదు. అసలు క్రికెట్ వ్యవహారాల్లో సలహా సంఘం పాత్ర ఏమిటన్నది కూడా స్పష్టం కాలేదు’ అని గంగూలీ వెల్లడించాడు. అయితే.. సలహా కమిటీలో ఎన్నికైన వారి పాత్రలు త్వరలోనే వెల్లడిస్తామన్నట్లుగా బీసీసీఐ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sourav ganguly  sachin tendulkar  bcci advisory committee  vvs laxman  

Other Articles