SachinTendulkar | Birthday | Today | April24 | Friday

Cricket legend sachin tendulkar celebrating his birth day today

cricket, sachin, birth day, mumbai, sachin tendulkar

cricket legend sachin tendulkar celebrating his birth day today. Sachin entering into 42 years. Sachin plans to watch the match of IPL at mumbai.

క్రికెట్ లెజెండ్.. సచిన్ టెండూల్కర్ బర్త్ డే నేడు

Posted: 04/24/2015 11:39 AM IST
Cricket legend sachin tendulkar celebrating his birth day today

క్రికెట్ చరిత్రలో దేవుడిగా కొలిచిన క్రికెటర్, రికార్డుల వరదను మైదానాలపై పారించిన దిగ్గజం , భారత మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ నేడు 42 సంవ్సరంలోకి అడుగుపెట్టనున్నాడు. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి అప్పుడే 16 నెలలు గడిచిపోయాయి. వాంఖడే స్టేడియంలో లో 2013లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ అనంతరం సచిన్ టెండూల్కర్ భావోద్వేగాల మధ్య అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. సుమారు 25ఏళ్లపాటు మైదానంలో తన బ్యాటింగ్‌తో అలరించిన సచిన్ టెండూల్కర్ ఇప్పుడు.. తన వ్యాఖ్యలు, పర్యటనలతో ఆకట్టుకుంటున్నాడు.

‘ప్లేయింగ్ ఇట్ మై వే'అనే శీర్షికతో సచిన్ టెండూల్కర్ గత నవంబర్‌లో విడుదల చేసిన తన ఆటో బయోగ్రాఫీ పుస్తకానికి అనూహ్యమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అంతేగాక, 2015 ప్రపంచ కప్ టోర్నీకి సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్‌లో కేరళ బ్లాస్టర్ ఫుట్‌బాల్ జట్టుకు సహా యజమానిగా సచిన్ కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ మ్యాచుల్లో వంద సెంచరీలు చేసిన సచిన్.. ఏప్రిల్ 24న తన 42వ పుట్టిన రోజును జరుపుకోనున్నాడు. కాగా, ఆ తర్వాతి రోజున ముంబై ఇండియన్స్ జట్టు హోంగ్రౌండ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. కాగా, రిలియన్స్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో 28,000 మంది చిన్నారులతో కలిసి సచిన్ టెండూల్కర్ శనివారం జరగనున్న ఈ మ్యాచును చూడనున్నాడు. మరి మనమూ సచిన్ టెండూల్కర్ కు బర్త్ డే విషెస్ చెబుదామా.. మరి ఆలస్యమెందుకు హ్యాపీ బర్త్ డే టు యు సచిన్ టెండూల్కర్.. ఫ్రం తెలుగు విశేష్ టీం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  sachin  birth day  mumbai  sachin tendulkar  

Other Articles