MS Dhoni calmer captain than Michael Clarke and Brendon McCullum, says Michael Hussey

Michael hussey wants to emulate dhoni s equanimity

Michael Hussey on MS Dhoni, Indian Premier League (IPL) 2015, Australia captain Michael Clarke, newzealand captain Brendon McCullum, good chemistry between Dhoni and coach Stephen Fleming, new zealand batsman michael Hussey

Former Australia and current Chennai Super Kings (CSK) batsman Michael Hussey said that he would love to have captain Dhoni's equanimity at the end of the innings.

ధోనిలా కూల్ గా వుండాలంటే చాలా ఇష్టం

Posted: 04/07/2015 01:24 PM IST
Michael hussey wants to emulate dhoni s equanimity

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తరహాలో చాలా కూల్ ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ఆసీస్ మాజీ ఆటగాడు మైక్ హస్సీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హస్సీ.. ధోనీ ఆటతీరు తనను ఎంతో ఆకట్టుకుంటుదని ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రత్యేకంగా ధోనీ కూల్ గా ఇన్నింగ్స్ ను ముగించే తీరు తనకు ఇష్టమన్నాడు. తాను కూడా అదే మాదిరిగా ఉండాలని అనుకుంటున్నట్లు తాజాగా స్పష్టం చేశాడు. అస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైనా ఎలాంటి ఒత్తడిని కనిపించకుండా కూల్ గా నవ్వుతూ మాట్లడటం అతనిలోని క్రీడాస్పూర్తికి నిదర్శనమని చెప్పాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టన్ మైకిల్ క్లార్క్, న్యూజీలాండ్ టీమ్ కెప్టన్ బ్రెన్ డన్ మెక్ కలమ్ ల కన్నా కూల్ గా వుంటారని అన్నారు.
 
ఏప్రిల్ 8 నుండి ఐపీఎల్-8 సీజన్ ఆరంభమయ్యే క్రమంలో హస్సీ మీడియాతో ముచ్చటించాడు. తాను ధోనీలా కూల్ గా ఉండాలనుకుంటున్నా. తొలుత క్రీజ్ లోకి వచ్చేటప్పుడు ఎలా ఉంటాడో.. ఇన్నింగ్స్ పూర్తి చేసినప్పుడు కూడా అంతే నిశ్చంతగా ఉంటాడని అన్నారు.. ధోనీ శక్తిని ఎప్పుడూ తానెప్పుడూ ఇష్టపడతానని నవ్యూతూ అన్నారు. తనకు కూడా అలానే ఉండాలన్న కోరిక వుందని హస్సీ తెలిపాడు. తాను కొన్ని సందర్భల్లో బలహీన క్షణాలను చూశానని.. అటువంటి సమయంలో తన సగటు తగ్గిపోయిందన్నాడు. అయితే ధోనీ మాత్రం ఎంతటి పెద్ద లక్ష్యమైనా.. ఎటువంటి ఆందోళన చెందకపోవడం నిజంగా గొప్ప విషయమన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టన్ ధోణికి, జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లమింగ్ కు మధ్య మంచి కెమిస్ట్రీ వుందని, అదే జట్టు విజయానికి దోహదపడుతుందని హస్సీ చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 8 2015  MS Dhoni  Michael Hussey  

Other Articles