England victory over scotland

england, scotland, world cup 2015, moeen ali, anderson

England completed a clinical 119-run victory over Scotland in their cricket World Cup Pool A match at Hagley Oval on Monday to record their first win in the tournament.

వరల్డ్ కప్ లో బోణి కొట్టిన ఇంగ్లాండ్

Posted: 02/23/2015 01:08 PM IST
England victory over scotland

ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ బోణి కొట్టింది. స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ 119 పరుగులతో విజయాన్ని స్వంతం చేసుకుంది. గత రెండు మ్యాచుల్లోనూ ఓటమిపాలైన ఇంగ్లాండ్, ఈ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాంగ్ 303 పరుగులు చేసింది. అలీ అద్బుత ప్రదర్శనతో రాణించారు. అలీ 128 పరుగులు చేసి, ఇంగ్లాండ్ విజయానికి దారులు తెరిచారు. స్కాట్లాండ్ బౌలర్లు ప్రారంభంలో దూకుడును ప్రదర్శించినా, ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ లను కట్టి చెయ్యడంలో విఫలమయ్యారు. ఇంగ్లాండ్ ఆటగాడు అలీ మైదానంలో బంతిని బౌండరీలు దాటించాడు. అలీ మెరుపులకు స్కాట్లాండ్ ఆటగాళ్లు బెంబేలెత్తారు. స్కాట్లాండ్ బౌలర్లు వికెట్లు తియ్యడంలో విజయం సాధించినా, ఇంగ్లాండ్ కు పరుగులు రాకుండా అడ్డుకోవడంలో విఫలమయ్యారు.

ప్రపంచ కప్ 2015 లో ఎన్నో అంచనాలతో బరిలో దిగిన ఇంగ్లాండ్ ప్రారంభం నుండే పేలవమైన ప్రదర్శనను ప్రదర్శించింది. రెండు మ్యాచుల్లో ఇంగ్లాండ్ ఆటగాళ్ల ప్రదర్శన ఇంగ్లాండ్  అభిమానులకు నిరాశనే మిగిల్చింది. అయితే స్కాట్లాండ్ లాంటి చిన్న దేశంపై ఇంగ్లాండ్ విజయాన్ని సాధించి, తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంగ్లాండ్ మూడో మ్యాచ్ లో కానీ ఖాతా తెరవకపోవడం గమనార్హం. అయితే స్కాట్లాండ్ బ్యాట్స్ మన్ లను కట్టడి చేసి 184 పరుగుల వద్దే ఆలౌట్ చేసింది. స్కాట్లాండ్ ఆటగాళ్లలో కొయెట్జర్ మినహా ఎవరూ రాణించలేదు. అండర్సన్, వోక్స్, అలీ తలా రెండేసి వికెట్లను తీశారు. అలీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. మొత్తానికి ఇంగ్లాండ్ ఈ ప్రపంచ కప్ లో పోటీలో ఉందని నిరూపించుకుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : england  scotland  world cup 2015  

Other Articles