India beat south africa with 130 runs

india beat south africa with 130 runs, india beat south africa in second match, ICC Cricket World Cup 2015, india vs south africa, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, virat kohli, Cricket, CWC 2015, india, india CWC 2015, Live Scores, Live Updates, south africa, siuth africa 2015, Sports, World Cup Live,

shikhar dhawan century helps team india to beat south africa with 130 runs

సఫారీలను చిత్తచేసిన టీమిండియా..శివమెత్తిన శిఖర్

Posted: 02/22/2015 04:49 PM IST
India beat south africa with 130 runs

ప్రపంచకప్ క్రికెట్ టార్నమెంట్ లో భాగంగా అస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో సపారీలను.. టీమిండియా చిత్తు చేసింది. ప్రపంచ కప్ లో ఇప్పటివరకు భారత్ పై ఓటమి ఎరుగని సౌత్ ఆఫ్రికాలకు ధోణి సేన ఓటమిని రుచి చూపించి రికార్డులను తిరగరాసింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ సఫారీలపై శివమెత్తి ప్రత్యర్థి బౌలర్లను మట్టికరిపించాడు. ధావన్ సెంచరీ చేసిన ప్రతీ మ్యాచ్ లోనూ టీమిండియాను విజయం వరించింది. అదే అనవాయితీ ఇవాళ కూడా కోనసాగింది.

డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన ధోణిసేన అంచనాలను మించి రాణిస్తూ ఆల్ రౌండ్ షోతో అదరగొడుతోంది. టీమిండియా బౌలింగ్ అంత పటిష్టంగా లేదని విమర్శలు ఎదుర్కోంటున్న సమయంలో సఫారీలను చిత్త చేసి తమ సత్తాను చాటారు. ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో ధోనీసేన 130 పరుగులతో సఫారీలను చిత్తుగా ఓడించారు. ధవన్ సూపర్ సెంచరీకి తోడు బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు విజయాన్నందించారు.
 
308 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు 40.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటయ్యారు. అశ్విన్ మూడు, మోహిత్, షమీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా జట్టులో డుప్లెసిస్ (55) టాప్ స్కోరర్. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ చెల్లాచెదురైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ధోనీసేన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 307 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (146 బంతుల్లో 16 ఫోర్లు, 2  సిక్సర్లతో 137) ధనాధన్ ఇన్నింగ్స్తో దుమ్మురేపాడు. వన్డేలలో శిఖర్ ధావన్ తన అత్యధిక స్కోరును తిరగరాసుకున్నారు. సఫారీలపై గతంలో చేసిన 114 రన్స్ స్కోరును చెరిపేసి.. 137 పరుగులను సాధించాడు. రహానె (60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 79) హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. భారత్ డాషిండ్ బ్యాట్స్ మెన్, వైస్ కాప్టెన్ విరాట్ కోహ్లీ కొద్దిలో హాప్ సెంచరీ మిస్ అయ్యి 46 పరుగులతో రాణించాడు. మొత్తంగా ధోణిసేన ఏడు విక్కెట్లను నష్టపోయి 307 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే రనౌటయ్యాడు. దీంతో ధవన్, కోహ్లీ పరిస్థితిని చక్కదిద్దారు. వీరిద్దరూ జట్టును మెరుగై దశకు తీసుకువచ్చేందుకు కృషి చేశారు. ధవన్, కోహ్లీ రెండో వికెట్కు 127 పరుగులు జోడించారు. కాగా కోహ్లీ 46 పరుగుల వద్ద ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్లో డుప్లెసిస్కు క్యాచిచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రహానె, కూడా పరుగుల వరద సృష్టించాడు. ఈ క్రమంలో ధవన్ సెంచరీ, రహానె హాఫ్ సెంచరీ చేశారు. వీరిద్దరూ మూడో వికెట్కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరును 250 మార్క్ దాటించారు. అనంతరం ధావన్ ఔటవ్వడంతో భారత్ పరుగుల వరదకు బ్రేకులు పడ్డాయి.

కాగా టిమిండియా మిడిల్ ఆర్డర్ మళ్లీ విఫలమైంది. భారత్ స్కోరును సుమారుగా 330 పరుగులు దాటిస్తుందని అభిమానులు ఆశించిన తరుణంలో సురేష్ రైనా, జెడేజా, దోణి లు విఫలమైయ్యారు. పటిష్టసాయిలో వుండి శాసిస్తున్న తరుణంలో వరస విక్కెట్లను కోల్పోయిన భారత్.. మూడు వందల పరుగులను దాటడమే కష్టమనిపించింది. అయితే ధోణి వరుసగా హ్యట్రిక్ ఫోర్లను సాధించడంతో భారత్ మూడు వందల మార్కును దాటింది. షమీ.. స్టీన్ బౌలింగ్ లో ఒక బౌండరీని సాధించడంతో భారత్ 307 పరుగులను సాధించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  india  south africa  virat kohli  

Other Articles

  • Play bilateral series or cut off all ties with pakistan shoaib akhtar to india

    భారత్ పాక్ ద్వైపాక్షిక క్రికెట్ పైనే ఎందుకు ఆంక్షలు

    Feb 18 | భారత్-పాకిస్థాన్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులను నిలిపిపేసి ఎనిమిదేళ్లు కావస్తున్న తరుణంలో.. ఇప్పటికైనా రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపర్చాలని పాకిస్తాన్ పేసు గుర్రంగా, రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరొందిన వెటరన్... Read more

  • Our team is growing day by day india women captain harmanpreet kaur

    ప్రపంచకప్ కోసం శక్తివంచనలేని ప్రయత్నం: హర్మన్

    Feb 18 | ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైంది. ఈనెల 21న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో భారత్‌ తొలి మ్యాచ్లో తలపడనుంది. ప్రపంచకప్ హాట్ ఫేవరెట్... Read more

  • Faf du plessis steps down as south africa captain in all formats

    సంచలన నిర్ణయం తీసుకున్న డుప్లెసిస్.. ఇక..

    Feb 17 | దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఫా డుప్లెసిస్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను అన్ని ఫార్మెట్ల నుంచి సారథ్యభాద్యతలను వదిలేస్తున్నట్లు పేర్కొన్నాడు. యువ నాయకత్వంలో అడాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇలా చేయడం... Read more

  • Achini kulasuriya hospitalised after shocking blow to the head in t20 world cup warm up game

    శ్రీలంక జట్టుకు గట్టి షాక్.. త్వరగా కొలుకున్న అచిని

    Feb 17 | ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైన వేళ.. శ్రీలంక జట్టుకు గట్టి షాక్ తగిలింది. అయితే ఈ షాక్ నుంచి జట్టు త్వరగానే కొలుకుని మేము... Read more

  • Ind vs nz india should play kuldeep chahal pair together advises harbhajan singh

    కుల్చా ప్రభావం చూపుతుంది.. ఓటేసిన భజ్జీ..

    Feb 06 | న్యూజీలాండ్ తో టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేలో మాత్రం తొలి మ్యాచ్ ఓటమిపాలై శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో అతిధ్యజట్టుపై విజయం సాధించాలన్న కసితో ఉన్న భారత్ జట్టులో కొన్ని మార్పులు... Read more

Today on Telugu Wishesh