India vs england perth oneday match india cricket team loss

india vs england, india tri series, india vs england perth match, india loss perth match, india cricket team, india cricket team members, india england australia tri series

india vs england perth oneday match india cricket team loss : the cricket team of india has lost perth oneday against england with least score.

పెర్త్’లో భారత్’కు ‘బెర్త్’ లేకుండా చేసిన ఇంగ్లాండ్

Posted: 01/30/2015 05:37 PM IST
India vs england perth oneday match india cricket team loss

ముక్కోణపు సిరీస్’లో భాగంగా పెర్త్’లో జరిగిన మ్యాచ్’లో ఇంగ్లాండ్ జట్టు భారత్’కు బెర్త్ లేకుండా చేసింది. అందరూ ఊహించినట్లుగానే ఈ మ్యాచ్’లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు ఆటగాళ్లు చేతులెత్తేయడంతో టపీటపీమంటూ వెనువెంటనే వికెట్లు కోల్పోయారు. దీంతో కేవలం 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ప్రభావం బౌలర్లపై భారీగానే పడింది. ఇక బ్యాటింగ్ బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు కూడా మొదట్లోనే పవేలియన్’కు చేరడంతో గెలుపు ఇండియావైపు మరలింది. బౌలింగ్’లో భారత్ బాగానే రాణించిందని అనుకున్నారు. కానీ.. అప్పుడే బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ఇంగ్లాండ్ ఆటగాడు తన జట్టుకు అండగా నిలిచి గెలుపువైపు దిశగా తీసుకెళ్లాడు. అతనితోపాటు మరొకరు తోడై జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు.

మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్’ను ఎంచుకుంది. దీంతో ఇండియా బ్యాటింగ్ బరిలో దిగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాటుతో మైదానంలోకి వచ్చిన భారత్ ఓపెనర్లు రహానే, శిఖర్ ధావన్.. తమ వికెట్ కోల్పోకుండా ఓ మోస్తరు వరకు పటిష్టంగానే రాణించారు. ఓవర్ల మీద ఓవర్ల మింగేస్తూ తక్కువ స్కోరు చేసినా.. వికెట్ కాపాడుకోవడంలో శాయశక్తులా ప్రయాణించారు. అయితే 83 పరుగుల వద్ద ధావన్ ఔటయ్యాడు. తర్వాత బరిలోకి దిగిన కోహ్లీ 8 పరుగులకే వెనుదిరిగాడు. అంతే! అక్కడి నుంచి ఇండియా ఆటగాళ్లు వరుసగా టపీటపీమంటూ వికెట్లు కోల్పోతూ వచ్చారు. అయితే.. రహానే (73) ఒక్కడే అత్యధిక స్కోరుతో తమ ప్రతిభను నిరూపించుకున్నాడు. దీంతో ఇండియా నిర్ణీత 48.1 ఓవర్లలో ఆలౌట్ అయి కేవలం 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇక 201 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. మొదట్లో భారత బౌలర్ల ధాటికి తడబడ్డారు. 14 పరుగుల వద్దే వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. తమ జోరును తగ్గించుకుని జాగ్రత్తగా ఆడారు. ఇంతలోనే వారి వికెట్లు కూడా వరుసగా పడిపోవడం మొదలయ్యాయి. ఒకానొక దశలో 18 ఓవర్లకుగానూ ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక 20వ ఓవర్లో బిన్నీ 5వ వికెట్ తీసుకున్నాడు. అంతే! ఇక క్రీజులో వున్న జేమ్స్ టేలర్, జాన్ బట్లర్ నిలకడగా ఆడుతూ వచ్చారు. దీంతో ఇంగ్లాండో 27 ఓవర్లలో 101/5 పరుగులు చేసింది. అయితే.. టేలర్ 82, బట్లర్ 67 పరుగులతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో మొత్తం 7 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 201 పరుగులు చేసి గెలిచింది.

దీంతో ఇండియా జట్టు ఈ ముక్కోణపు సిరీస్ నుంచి ఔట్ అయింది. ఇక ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. ఇదిలావుండగా.. ఇండియా ప్రదర్శించిన ఆటను చూస్తుంటే.. ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్’లో ఇదే పరిస్థితిని కొనసాగిస్తుందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరల్డ్ కప్’కు హెల్ప్ అవుతుందనే భావనతో ఇండియాను ముక్కోణపు సిరీస్’కు పంపితే.. ఒక్క విజయం కూడా సాధించుకోకుండా రాక, పేలవమైన ప్రదర్శనతో వెనుదిరిగి వచ్చేసింది. మరి.. వరల్డ్ కప్’లో ఎలా ఆడనుందో?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england perth match  england india australia tri series  

Other Articles