Rohit sharma 264 record score eden gardens kolkata srilanka india fourth oneday match

rohit sharma, rohit sharma latest news, rohit sharma double century, rohit sharma 264 score, rohit sharma eden gardens, india vs srilanka oneday series, eden gardens kolkata, india cricket team records, srilanka cricket team

rohit sharma 264 record score eden gardens kolkata srilanka india fourth oneday match

రోహిత్ రికార్డు వెనుక శ్రీలంక నిర్లక్ష్యం.. 4సార్లు మిస్ చేశారు..

Posted: 11/14/2014 01:15 PM IST
Rohit sharma 264 record score eden gardens kolkata srilanka india fourth oneday match

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో భారత్-శ్రీలంక నాలుగో వన్డే సందర్భంగా యువ ఆటగాడు రోహిత్ శర్మ 264 పరుగులు చేసి ప్రపంచరికార్డు సృష్టించిన విషయం తెలిసిందే! దాంతోపాటు ఇన్నింగ్స్ లో అత్యధిక ఫోర్లు (33), రెండు డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా, ఈడెన్ గార్డెన్ లో టీమిండియా 5సార్లు 400 పరుగులు చేసిన రికార్డు.. ఇలా రికార్డుల మోతే మోగింది. అయితే రోహిత్ ఇన్ని రికార్డులు సృష్టించడానికి మొదటి కారణం శ్రీలంక జట్టు చేసిన నిర్లక్ష్యమే! రోహిత్ బరిలోకి రాగానే తడబడుతూ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సందర్భంలో చాలాసార్లు ఔట్ అవుతూ.. బతికి బయటపడ్డాడు. అలా లంక ఆటగాళ్లు లైఫ్ ల ఆఫర్లు ఇవ్వడంతో రోహిత్ విజృంభించేశాడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని, క్రికెట్ చరిత్రలో సరికొత్త సంచలనం సృష్టించాడు.

మొదట బరిలోకి దిగిన రోహిత్ ఒక్క పరుగు చేసిన అనంతరం రనౌట్ అవ్వాల్సి వుండేది. లంక ఆటగాళ్ల నిర్లక్ష్యంతో అతను ఔట్ కాలేదు. ఆ తర్వాత బంతిని ఎదుర్కోవడంలో చాలానే ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఇబ్బంది పడుతూ మెయిడెన్ ఓవర్ మింగేశాడు. అనంతరం 4 పరుగుల వద్దే సునాయాసంగా క్యాచ్ అందించాడు కానీ.. అది నేలపాలు అయ్యింది. అదే రోహిత్ కు టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత ఎంతో శ్రద్ధగా బంతిని ఎదుర్కొంటూ పరుగులు చేయడం మొదలుపెట్టాడు. 22వ బంతికి అతడు మొదటి బౌండరీని అందుకున్నాడు. అయితే ఆరంభంలో చాలావరకు రోహిత్ శర్మ ఇన్నింగ్స్ బాగా సాగదీరింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. రోహిత్ అర్థ సెంచరీ చేసేంతవరకు అది అందరికీ సహనానికి పెట్టిన పరీక్షగా మారింది. అయితే అర్థశతకం చేసిన అనంతరం శర్మ చెలరేగిపోయాడు.

మొదట అర్థసెంచరీ చేసేందుకు 72 బంతులు తీసుకున్న రోహిత్.. ఆ తర్వాత మరో 28 బంతులకే సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత రోహిత్ బ్యాటింగ్ కు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. శతకం చేసిన ఊపులో అతడు మైదానంలో ప్రతిఒక్కరికీ చుక్కలు చూపించేశాడు. 100 బంతుల్లో 100 పరుగులు సాధించిన రోహిత్.. ఆ తర్వాత 164 పరుగులు సాధించడానికి కేవలం 73 బంతులు మాత్రమే తీసుకున్నాడు. అందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 200 నుంచి 250 మైలురాయిని చేరుకునేందుకు అతనికి కేవలం 15 బంతులే సరిపోయాయి. ఇంకొక విషయం ఏమిటంటే.. 201, 222 పరుగుల రోహిత్ క్యాచ్ లను వదిలేసి.. లంక ఆటగాళ్లు అతని చేతిలో రికార్డులు పెట్టారు. ఆ పరుగుల వద్ద అతనికొచ్చిన లైఫులో అతనికి ప్రపంచవ్యాప్తంగా విజయకెరటం ఎగురవేయడానికి సహాయపడ్డాయి.

ఇతర ఆటగాళ్లతో భాగస్వామ్యం :

ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్.. మొదటినుంచి నిలకడగా ఆడుతూ చివరిదాకా నిల్చున్నాడు. అయితే ఇతర ఆటగాళ్లు కాస్త పేలవ పెర్ఫామెన్స్ లతో పవెలియన్ కు వెనుదిరిగారు. కానీ విరాట్ మాత్రం ఇతనికి సహాయంగా వుంటుంది భారీ భాగస్వామ్య స్కోరు క్రియేట్ చేశారు. కోహ్లీతో కలిసి రోహిత్ 202 పరుగులు జత చేస్తే.. అందులో 132 పరుగులు రోహిత్ చేసినవే వున్నాయి. అలాగే ఉతప్పతో 128 పరుగులు జోడిస్తే.. ఏకంగా 109 పరుగులు రోహిత్ చేయడమే విశేషంగా మారింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles