Kapil dev comments sachin tendulkar auto biography playing it my way australia tour

kapil dev, kapil dev latest news, kapil dev news, kapil dev sachin tendulkar, sachin tendulkar news, sachin tendulkar book, sachin tendulkar auto biography, sachin tendulkar playing it my way book

kapil dev comments sachin tendulkar auto biography playing it my way australia tour

సంచలనాలకు అడ్డాగా సచిన్ ఆత్మకథ.. కపిల్ కామెంట్..

Posted: 11/13/2014 01:12 PM IST
Kapil dev comments sachin tendulkar auto biography playing it my way australia tour

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రాసుకున్న తన ఆత్మకథ ‘‘ప్లేయింగ్ ఇట్ మై వే’’ మొదటినుంచి వివాదాలకు అడ్డాగా మారిపోయింది. తన 24ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఏంజరిగిందో మొత్తంగా విశదీకరించి మరీ చెప్పాడు. జట్టులో వున్నంతవరకు ఎవరిమీద కామెంట్ చేయని సచిన్.. రిటైర్ అయిన అనంతరం అందరి బాగోతాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాడు. మొన్నటికి మొన్న మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు సంధించిన అనంతరం మరికొన్ని ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అలాగే ఇండియాకు మొదటిసారి ప్రపంచకప్ ను అందించిన కపిల్ దేవ్ మీద సైతం సచిన్ వివాదాస్పద అభిప్రాయాలను వెల్లడించిన విషయం తెలిసిందే!

1999-2000లో జరిగిన ఆసీస్ పర్యటనలో భాగంగా భారత్ కోచ్ గా వున్న కపిల్ దేవ్.. ఆనాడు జట్టు వ్యవహారాలను, వ్యూహాలను రచించడంలో అసలు కల్పించుకునేవారే కాదని.. కోచ్ గా అతడు సరిగ్గా పనిచేయలేకపోయాడంటూ సచిన్ తన ఆత్మకథలో వెల్లడించిన విషయం తెలిసిందే! అయితే దీనిపై కపిల్ దేవ్ ఇంతవరకూ ఏమీ స్పందించలేదు. దీంతో అభిమానులందరిలోనూ కాస్త ఉత్కంఠగా మారిపోయింది. కపిల్ లాంటి గ్రేట్ క్రికెటర్ మీద కూడా సచిన్ కామెంట్ చేయడం.. ఆయన దానికి రిప్లై ఇవ్వకపోవడం కాస్త టెన్షన్ కు దారితీసింది. ఆయన ఎలా స్పందిస్తాడోనని అందరూ ఎదురుచూడసాగారు. అయితే ఆ వెయిట్ కి ఇక చెక్ పడిపోయింది. తాజాగా ఆయన సచిన్ చేసిన వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

20ఏళ్ల అమన్ సహానీ అనే టెక్కీ ‘‘స్లోపో.కామ్’’ అనే కొత్త సోషల్ గేమింగ్ సైట్ ను తయారుచేశాడు. ఆ కొత్త బిజినెస్ వెంచర్ కు సహయజమానిగా వ్యవహరిస్తున్న కపిల్.. దాని ప్రారంభ సందర్భంగానే సచిన్ కామెంట్లపై వివరణ ఇచ్చుకున్నాడు. ఆ నేపథ్యంలోనే కపిల్ మాట్లాడుతూ... ‘‘అభిప్రాయాలు వెల్లడించడానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది. కాబట్టి వారి అభిప్రాయాలను నేను గౌరవిస్తా. సచిన్ చేసిన వ్యాఖ్యలు అతని వ్యక్తిగత అభిప్రాయం. సచిన్‌కు మంచి జరగాలని మాత్రమే నేను కోరుకుంటా. మిగతా వాటిపై మాట్లాడలేను’’ అని పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  playing it my way book  kapil dev  sachin auto biography  

Other Articles