Suresh raina mother getting doubts on his affairs

suresh raina, suresh raina latest news, suresh raina mother, suresh rain latest news, suresh raina national media interview, suresh raina affairs, suresh rain sruthi hassan, sruthi hassan hot photos, sruthi hassan photos

suresh raina mother getting doubts on his affairs

ఎఫైర్లు నడుపుతున్న రైనా.. అనుమానిస్తున్న తల్లి!

Posted: 09/15/2014 06:03 PM IST
Suresh raina mother getting doubts on his affairs

టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా సీక్రెట్ గా ఎఫైర్లు నడుపుతున్నాడని ఈమధ్య వార్తలు తెగ షికార్లు చేస్తున్నాయి. ఒక రాజకీయనేత కుమార్తెతోనూ, నటి శృతిహాసన్ తోనూ రైనా డేటింగ్ చేస్తున్నాడని... రాత్రింబవళ్లు వారితో కాలక్షేపం చేస్తున్నాడని ఆమధ్య తెగ వార్తాకథనాలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలోనే అతని తల్లి కూడా అనుమానాలు వ్యక్తం చేసిందట! తన కొడుకు ఎవరితో సీక్రెట్ గా తిరుగుతున్నాడని.. అయితే ఆ విషయాలు అడిగితే మాత్రం మొహం చాటేస్తున్నాడని రైనా తల్లి ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం! ఈ విధంగా రైనా తల్లి ఆవేదనను బహిర్గతం చేసింది మరెవరో కాదు.. స్వయంగా రైనానే నేషనల్ మీడియాతో ఈ సంగతులను పంచుకున్నాడు.

నిజానికి సురేష్ రైనా స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్! అయితే తరచూ అతను లక్నోకు చక్కర్లు కొడుతుంటాడు. ఈ నేపథ్యంలోనే అనుమానించిన అతని తల్లి.. తనను తప్పకుండా ఒక ప్రశ్న అడుగుతుందని రైనా చెప్పాడు. ‘‘తరుచూ నువ్వు లక్నోకు ఎందుకు వెళుతున్నావు? అక్కడ ఏ అమ్మాయినైనా ఇష్టపడుతున్నావా..?’’ అని చాలాసార్లు తన తల్లి అడిగిందని రైనా చెప్పుకొచ్చాడు. అయితే తాను కేవలం తన మిత్రులను కలుసుకోవడానికే మాత్రమే తరచూ లక్నోకు వెళుతుంటానని.. వారితో ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతానని వివరించాడీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్.

తన తోటి ఆటగాళ్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకోని తండ్రులు అవుతుండటాన్ని చూసి.. తన తల్లి తనను పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తోందని రైనా తెలిపాడు. తనను పెళ్లికొడుకుగా చూడాలన్నదే తన తల్లి ఉద్దేశ్యమని ఆమె మనోభావాల గురించి వివరించాడు. అయితే వరల్డ్ కప్ తరువాతే తాను పెళ్లి గురించి ఆలోచిస్తానని రైనా స్పష్టం చేస్తున్నాడు. అలాగే తాను ఎవరితోనూ ఎఫైర్లు నడపటం లేదని.. మీడియాలో వచ్చే వార్తల గురించి తానేమీ పట్టించుకోనని రైనా పేర్కొంటున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles