Glenn maxwell vs kolkata knight riders

glenn maxwell, kolkata knight riders, ipl, ipl 2014, glenn maxwell vs kolkata knight riders.

glenn maxwell vs kolkata knight riders

మాక్స్‌వెల్ భయంతో వణుకుతున్న నైట్ రైడర్స్

Posted: 04/26/2014 01:48 PM IST
Glenn maxwell vs kolkata knight riders

అన్నీ జట్ల మాదిరిగానే కోల్‌కతా నైట్ రైడర్స్‌ను కూడా గ్లేన్ మాక్స్‌వెల్ భయం వెంటాడుతోంది. అతనికి డేవిడ్ మిల్లర్ కూడా జత కలవడంతో బ్యాటింగ్‌లో పటిష్టంగా కనిపిస్తున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో శనివారం జరిగే మ్యాచ్‌కి నైట్ రైడర్స్ సమాయత్తమవుతోంది. 

అయితే మాక్స్‌వెల్‌ను ఏ విధంగా కట్టడి చేయాలన్నది ఆ జట్టును వేధిస్తున్న ప్రశ్న. మాక్స్‌వెల్ మూడు మ్యాచ్‌ల్లో 95, 89, 95 చొప్పున పరుగులు సాధించాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌కు భారీ లక్ష్యాలు కూడా చిన్నవిగా మారిపోతున్నాయి. లక్ష్యాన్ని నిర్దేశించడంలో లేదా ఛేదించడంలో మాక్స్‌వెల్ విజృంభణకు బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. 

అదే స్థాయిలో రాణించడం పంజాబ్‌ను పటిష్టమైన స్థితిలో నిలబెట్టింది. వీరేందర్ సెవాగ్ విఫలమవుతున్నప్పటికీ, చటేశ్వర్ పుజారా, మాక్స్‌వెల్, పుజారా తదితరులతో జార్జి బెయిలీ నాయకత్వం వహిస్తున్న పంజాబ్ బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తున్నది. 

అయితే, ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో ఈ ముగ్గురినీ మినహిస్తే మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడి ప్రతి మ్యాచ్‌లోనూ గెలవడం అనుకున్నంత సులభం కాదు. మిగతా ఆటగాళ్లు కూడా తమ పాత్రలను సమర్థంగా పోషిస్తేనే విజయాలు సాధ్యమవుతాయి. 

వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఉద్దేశించిన ప్రపంచ వారోత్సవాలకు మద్దతుగా శనివారం నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాళ్లంతా చేతికి నీలం రంగు పట్టీలు కట్టుకొంటారు. ఇలాంటి ఒక సత్కార్యానికి తమ వంతు సాయం అందించడం ఎంతో ఆనందంగా ఉందని పంజాబ్  విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles