Bcci chief n srinivasan must quit supreme court

BCCI chief N Srinivasan, Srinivasan, Supreme Cour, BCCI chief N Srinivasan, Indian Premier League fixing, IPL fixing, BCCI Presiden.

BCCI chief N Srinivasan must quit-Supreme Court

పద్దతిగా దిగిపో..శ్రీనివాసన్‌కు సుప్రీంకోర్టు అల్టిమేటం

Posted: 03/26/2014 12:55 PM IST
Bcci chief n srinivasan must quit supreme court

ఇన్ని ఆరోపణల తర్వాత కూడా ఆయన ఎలా కొనసాగుతారు. ఇది క్రికెట్‌కు మంచిది కాదు’ అని పట్నాయక్ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్‌కు సంబంధించి ముద్గల్ కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో చాలా తీవ్రమైన ఆరోపణలు, కీలకాంశాలు ఉన్నాయని, వాటిపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.ఇంతకీ ఈయన ఎవరు  అనుకుంటున్నారా? బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్.

ఐపీఎల్‌కు సంబంధించి అవినీతి వ్యవహారాల్లో పారదర్శక విచారణ కోసం బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ రెండు రోజుల్లోగా తన పదవి నుంచి తప్పుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది.

ఈ కేసుపై జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం తన అభిప్రాయాలు వెల్లడించింది. నేరుగా ‘ఆదేశం’ ఇవ్వకపోయినా... సుప్రీంకోర్టు ఉద్దేశం మాత్రం స్పష్టంగా ఉంది. ‘శ్రీనివాసన్ రాజీనామా చేయాలి. లేదంటే అలాంటి ఆదేశాలు జారీ చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు.

 ఈ నేపథ్యంలో బోర్డు అధ్యక్షుడు పక్కకు తప్పుకుంటే గానీ, వాస్తవాలు వెల్లడి కావని న్యాయమూర్తి అన్నారు. ఈ కేసుపై గురువారంనాడు కూడా వాదనలు కొనసాగుతాయి. నివేదికలో ఉన్న వివరాలు, పేర్లు బయటపెట్టరాదని ఈ విచారణ సందర్భంగా బీసీసీఐ న్యాయవాదులు మరోసారి విజ్ఞప్తి చేశారు. 

సుప్రీంకోర్టు నిర్దేశాలను తాను ఇంకా పూర్తిగా చదవలేదని చెప్పిన శ్రీనివాసన్ ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. అయితే బోర్డు ఉపాధ్యక్షుడు రవి సావంత్ మాత్రం శ్రీనివాసన్ కి రాజీనామా తప్ప మరో మార్గం లేదని అన్నారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles