Steven gerrard won t take wife alex and family to world cup

Steven Gerrard, Alex, Steven Gerrard wife alex, World Cup, England captain,

Steven Gerrard won-t take wife Alex and family to World Cup

నా భార్య వల్ల ఆట ఆడలేకపోతున్నాను?

Posted: 03/25/2014 12:57 PM IST
Steven gerrard won t take wife alex and family to world cup

ప్రతీ విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు. కానీ ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ స్టీవెన్ గెరార్డ్ విషయంలో మాత్రం కాదట. భార్య, గాళ్‌ఫ్రెండ్స్ వెంట ఉంటే లక్ష్యంపై దష్టిపెట్టలేమని, ఏకాగ్రత కోల్పోతామని చెబుతున్నాడీ ఇంగ్లండ్ సాకర్ స్టార్. అందుకే బ్రెజిల్ వేదికగా జూన్‌లో ప్రారంభం కానున్న ఫిఫా ప్రపంచ కప్‌కు తన భార్య అలెక్స్‌ను వెంట తీసుకువెళ్లడం లేదంటూ ప్రకటించి నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఆటగాళ్లు తమ వెంట భార్యలను, గాళ్‌ఫ్రెండ్స్‌ను తీసుకురావచ్చు అని ఇంగ్లండ్ టీమ్ మేనేజర్ రాయ్ హాడ్జ్‌సన్ అనుమతి ఇస్తున్నా, గెరార్డ్ మాత్రం ససేమిరా అంటున్నాడు. 2006 ప్రపంచ కప్‌లో తాము విఫలమవడానికి ఈ ఆడవాళ్ల తాలూకు పరధ్యానమే కారణమని చెప్పాడు. 

2010 ప్రపంచ కప్‌లో తాను కుటుంబానికి దూరంగా ఉన్నానని, దాంతో ఆ టోర్నీలో అద్భుతంగా రాణించగలిగానని చెప్పాడు. అయితే హోంసిక్‌తో బాధపడే ఆటగాళ్లు తమ జీవిత భాగస్వాములను వెంట తెచ్చుకుంటే తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పి కొంతలో కొంతైనా తన జట్టు ఆటగాళ్లకు ఊరట కలిగించాడు.

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles