India beat afghanistan by 8 wickets

India beat Afghanistan by 8 wickets , Virat Kohli,Ravindra Jadeja,Mohammad Nabi,India vs Afghanistan,Asia cup

Jadeja magical figures of 4/30 followed by Shikhar and Rahane 121-run opening stand helped India beat Afghanistan in their inconsequential Asia Cup tie.

చివరి మ్యాచ్ లో చెలరేగి పోయారు

Posted: 03/06/2014 10:08 AM IST
India beat afghanistan by 8 wickets

అగ్ర జట్టుగా చెలామణి అవుతున్న టీం ఇండియా గెలవాల్సిన మ్యాచ్ ల్లో చాలా పొరపాట్లు చేసి ఓడి ఆసియా కప్ ఫైనల్ అవకాశాలు చేజార్చుకున్న తరువాత నామమాత్రపు మ్యాచ్ లో అన్ని విభాగాల్లో రాణించి పసికూన ఆప్ఘనిస్తాన్ పై కాస్తంత ఊరట పొందింది.

పాకిస్థాన్, శ్రీలంక పై రాణించని బౌలర్లు పసికూన పై చెరగడంతో ఆప్ఘాన్ పై ఎనమిది వికెట్ల తేడాతో గెలిచింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్టాన్ బ్యాట్స్ మెన్స్ బ్యాటింగ్ లో ఘోరంగా విఫలం అవ్వడమే కాకుండా, భారత స్పిన్ ధాటికి 45.2 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత స్పిన్ మాంత్రికులు జడేజా (4/30), అశ్విన్ (3/31) రాణించారు. ఆప్ఘాన్ బ్యాట్స్ మెన్స్ లో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.

షెన్వారి అర్థ శతకంతో రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా చేసింది. తరువాత స్వల్ప లక్ష్యాన్ని ఛేధించడానికి బరిలో దిగిన భారత్ కేవలం 32.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా గెలిచి బోనస్ పాయింట్ తో గెలిచారు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (78 బంతుల్లో 60; 4 ఫోర్లు, 1 సిక్సర్), అజింక్యా రహానే (66 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు.

మొత్తం మీద ఆసియాకప్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరుగుతున్నా... బంగ్లాదేశ్‌లోనే మరో 15 రోజుల్లో ప్రారంభమయ్యే టి20 ప్రపంచకప్‌కు ఈ టోర్నీ ఓ సన్నాహకం అనుకోవాలి. మరి అప్పుడైనా రాణిస్తారో లేక ఇలా లీగ్ దశలోనే వెనుదిరుగుతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles