Australia clean sweep ashes series 5 0

Australia clean sweep, Ashes series, Australia v England at Sydney, England tour of Australia, Australia cricket, England cricket

Australia are closing in on a 5-0 clean sweep of the Ashes after the second day play against England in the fifth and final Test at the Sydney.

క్లీన్ స్వీప్ తో కంగారెత్తించారు

Posted: 01/05/2014 03:52 PM IST
Australia clean sweep ashes series 5 0

తన సొంత గడ్డ పై జరిగిన యాషెష్ టెస్టు సిరీస్ ను కంగారులు ఇంగ్లాండ్ ను క్లీన్ స్విప్ చేసి, గతంలో ఇంగ్లాండ్ గడ్డ పై జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లాండ్ జట్టును 5-0 సున్నాతో ఓడించి బూడిద సిరీస్ ను తన సొంతం చేసుకుంది. ఇది వరకే నాలుగు టెస్టులు ఘోరంగా ఓడిన ఇంగ్లాండ్ ఐదో టెస్టులో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని అనుకున్నా అది కూడా మిగల్లేదు.

చివరి టెస్టులో 281 పరుగుల భారీ తేడాతో ఓడింది. ఆసీస్ నిర్దేశించిన 448 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 166 పరుగులకే కుప్పకూలింది. 31.4 ఓవర్లలో చాప చుట్టేసింది. 52 నిమిషాల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయి బొక్కబోర్లా పడింది. అంతకుముందు 140/4 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ 276 పరుగులకు ఆలౌటయింది.

తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 326, ఇంగ్లండ్ 155 పరుగులు చేశాయి. ఆసీస్ బౌలర్ హారిస్ మ్యాజిక్కు ఇంగ్లీషు ఆటగాళ్లు దాసోసమయ్యారు. కార్బెరీ(43), బెల్(16), స్టోక్స్(32), బ్రాడ్(42) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇద్దరు డకౌటయ్యారు. మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. హారిస్ 5 వికెట్లు పడగొట్టాడు. జాన్సన్ 3, లియాన్ 2 వికెట్లు తీశారు. హారిస్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’, జాన్సన్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ’ దక్కించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles