sania-mirza-has-just-done-the-unthinkable-with-this-selfie

Know who are sania mirza s karan arjun in tennis arena

sania mirza, Leander Paes, Mahesh Bhupathi, Sania Mirza, Martina Hingis, Martina Navratilolva, sania mirza india, india sania mirza, sania mirza tennis, tennis news, tennis

Sania shares a picture with Leander Paes and Mahesh Bhupathi tags them as tennis karan arjun

టెన్నీస్ కరన్ అర్జున్ లతో సానియా

Posted: 11/22/2015 08:28 PM IST
Know who are sania mirza s karan arjun in tennis arena

భారత టెన్నీస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా ఆటలలోనే కాదు.. సినిమా నాలెజ్డ్ లోనూ అవగాహన బాగానే వుంది. నిత్యం ప్రాక్టీసు, టార్నోమెంట్లతో బిజీగా వుంటే సానియా.. సినిమాలు ఏం చేస్తుంది.. సినిమా నాలెజ్డ్ ఏం వుంటుందిలే అనుకునే వారికి షాక్ ఇచ్చేలా చేసింది సానియా.  పురుషుల టెన్నిస్‌లో ఆ ఇద్దరు దిగ్గజాలను కలిసిన అమె వారిని ఓ హిందీ సినిమా టైటిల్ తో పోల్చి .. అభిమానులను కూడా విస్మయానికి గురిచేసింది.

కోల్‌కతాలో ఈ నెల 25న జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా కలిసి ప్రాక్టీస్ చేశారు. ఈ కలయికను సెల్ఫీగా మార్చేసింది సానియా. దీంతో భారత టెన్నిస్ హేమాహేమీలు ముగ్గురు ఒకే ‘చిత్రం’లో చేరారు. దీనిని సానియా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.  షారుఖ్-సల్మాన్‌ల సూపర్ హిట్ మూవీ డైలాగ్‌ను గుర్తు చేస్తూ ‘ నా కరణ్-అర్జున్ వచ్చేశారు. ఇద్దరిలో ఎవరు ఎవరో వారే తేల్చుకుంటారు’ అని సరదాగా కామెంట్ చేసింది. ఐపీటీఎల్ ప్రమోషన్‌లో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని సానియా అకాడమీలో రెండో ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh bhupathi  Sania Mirza  Leander Paes  Tennis  

Other Articles

Today on Telugu Wishesh