Martina Hingis and Sania Mirza enter Quarter finals in Mutua Madrid Open

Hingis mirza back on track in madrid

Hingis & Mirza Back On Track In Madrid, switzerland tennis player martina Hingis, indian star tennis player Sania Mirza, Premier Mutua Madrid Open, andy murray, elina svitolina, karolina pliskova, maria sharapova, nick kyrgios, richard gasquet, roger federer, sania mirza, serena williams, simona halep, federer, editorials, tennis

Martina Hingis and Sania Mirza got back on track after their early loss in Stuttgart, cruising through their first match of the Premier Mandatory-level Mutua Madrid Open in an hour.

వరుసగా 4వ వారంలోనూ.. సానియా నెం. 1 ర్యాంక్

Posted: 05/06/2015 05:23 PM IST
Hingis mirza back on track in madrid

భారత టెన్నీస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా వరుసగా నాల్గవ వారంలోనూ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకులో కోనసాగుతోంది. టెన్నీస్ వుమెన్స్ డబుల్ లో సానియా తన జోరు కోనసాగిస్తూ.. నెంబర్ వన్ స్థానంలో కొనసాగతున్నారు. ప్రపంచ టెన్నీస్ ఫెడరేషన్ తాజాగా విడుదల చేసిన జాబితాలో సానియా మిర్జా వరుసగా నాల్గవ వారంలో నెంబర్ వన్ గా నిలిచారు. మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ లో ఓటమిని చవిచేసిన సానియా.. ఈ వెంటనే జరిగిన మ్యాచ్ లో గెలుపోంది క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకోళ్లడంతో ర్యాంకింగ్ లో నెంబర్ వన్ గా కోనసాగుతున్నారు.

మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో జత కట్టిన తరువాత సానియా మిర్జా విజయాల బాటలో దూసుకెళ్తోంది. ఈ ద్వయం తాజాగా జరుగుతున్న మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్పెయిన్‌లోని మాడ్రిడ్ నగరంలో జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-2, 6-3తో జానెట్టి హుసరోవా (స్లొవేకియా)-రలూకా ఒలారు (రుమేనియా) ద్వయంపై గెలిచింది. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) శుభారంభం చేసింది.

తొలి రౌండ్‌లో బోపన్న-మెర్జియా 5-7, 7-6 (7/5), 10-6తో మారిన్ ద్రగాంజ (క్రొయేషియా)-హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్)లపై గెలిచారు. మరో మ్యాచ్‌లో మహేశ్ భూపతి (భారత్)-నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) జంట 5-7, 3-6తో అండర్సన్ (దక్షిణాఫ్రికా)-జెరెమి చార్డీ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Martina Hingis  Sania Mirza  Quarter finals  Mutua Madrid Open  

Other Articles