Sania mirza clarifies on missing meal with obama

Sania clarifies missing meal with Obama, sania mirza, indian batminton player, sania clarifies on presidents invitation, sonia misses meal with obama, sania misses meal with obama, sania photos, sania profile, sania achivements, sania records, sania telangana brand ambassador, sania mirza twitter, sania mirza ranking, biography sania mirza, sania mirza website

sania clarrifies about her absence in attending President pranab mukharjee meal invitation along with US president barrack obama in twitter

ఒబామాతో విందుకు గైర్హాజరుపై సానియా వివరణ..

Posted: 01/27/2015 03:13 PM IST
Sania mirza clarifies on missing meal with obama

అమెరికా అధ్యక్షుడిని నేరుగా చూడాలంటేనే అదృష్టం కావాలి.. అలాంటిది అయనతో కలసి బోజనం చేయాలంటే.. అబ్బో.. పూర్వజన్మ సుకృతం వుంటేగాని అలాంటి అరుదైన అవకాశం లభించదు. కానీ అలాంటి అదృష్టం వచ్చినా.. నోచుకోలేకపోయింది భారత టెన్నిస్ క్రీడాకారిణి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా. అత్యంత అరుదుగా లభించే ఈ అవకాశాన్ని మిస్ చేసుకున్నందుకు తెగ బాధపడిపోతోంది. ఈ మేరకు తాను ట్విట్టర్ లోనూ విచారాన్ని వ్యక్తం చేసింది.

అసలు విషయమేమిటంటే.. భారత్ పర్యటనలో వున్న అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామాకు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి విందునిచ్చారు. ఈ విందు కార్యక్రమానికి పలువురు క్రీడాకారులకు కూడా రాష్ట్రపతి ఆహ్వానాలు పలికారు. అందులో సానియా మిర్జా కూడా ఒకరు. అయితే రాష్ట్రపతి నుంచి లభించిన ఆహ్వానానికి, అందులోనే అమెరికా అధ్యక్షుడు ఒబామాతో కలసి పాల్గోనే అవకాశం వచ్చినా.. తాను రాలేకపోయానని, సానియా మిర్జా పేర్కోంది. ఇందుకు గాను కారణాన్ని కూడా చెప్పింది. తాను అస్ట్రేలియాలో జరుగుతున్న ఓపెన్ టార్నమెంటు కోసం మెల్ బోర్న్ లో వున్నానని, తనకు వచ్చిన సదావకాశాన్ని జారవిడుచుకోవడం కూడా బాధగా వుందంటూ విచారణాన్ని వ్యక్తం చేసింది సానియా.. ఈ మేరకు ఇవాళ అమె సామాజిక వైబ్ సైట్ లో ట్విట్ చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  pranab mukharjee  barrak obama  

Other Articles