the historical story of srisaila bramarambika temple which is goddess second avatar | dussehra festival special | telugu mythological stories

Srisaila bramarambika temple history telugu mythological stories goddess durga avatars

srisaila bramarambika temple history, goddess durga devi avatars, durga devi special stories, telugu mythological stories, mythology, srisaila bramarambika, dussehra festival special, navaratrulu special

srisaila bramarambika temple history telugu mythological stories goddess durga avatars : the historical story of srisaila bramarambika temple which is goddess second avatar.

నవరాత్రుల 2వ రోజు : శ్రీశైల భ్రమరాంబిక

Posted: 10/20/2015 12:15 PM IST
Srisaila bramarambika temple history telugu mythological stories goddess durga avatars

దక్షిణాపధంలో ప్రసిధ్ధికెక్కిన ప్రాచీన శైవ క్షేత్రాలలో ప్రముఖమైన ‘శ్రీశైలం’ ఒకటి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో వున్న ఈ అత్యంత పురాతనమైన క్షేత్రానికి మరో విశిష్టత కూడా వుంది. అదేమిటంటే.. ద్వాదశ జ్యోతర్లింగాలలో రెండవది అయిన శ్రీ మల్లికార్జునుడు, అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది అయిన శ్రీ భ్రమరాంబిక ఒకే ప్రాకారంలో వేర్వేరు ఆలయాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పద్మ పురాణం, మత్స్యపురాణం, స్కాంద పురాణం, దేవీ భాగవతం వగైరా అనేక పురాణాలలో ప్రస్తుతించబడిన ఈ ‘శ్రీశైలం’ క్షేత్రం భూమండలానికి ‘నాభిస్ధానం’ అని స్ధల పురాణం చెబుతోంది.

శ్రీ భ్రమరాంబికాదేవి :

పూర్వం శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా.. ఆమె ఆ భాగాలు 101 ప్రదేశాలలో పడ్డాయి. సతీదేవి మెడ భాగం పడిన ప్రదేశం ఇది. పురాణ కధనం.. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు దేవతలనందరినీ జయించి తన అదుపులో వుంచుకోవాలనే కోరికతో చాలా కాలంపాటు గాయత్రీ మంత్రం జపిస్తూ తపస్సు చేశాడు. ఆ తపశ్శక్తివల్ల అతని శరీరంనుంచి అగ్ని జ్వాలలు లేచి లోకాలన్నిట్లో వ్యాపించసాగాయి. దేవతలందరి ప్రార్ధనపై బ్రహ్మ అతనికి ప్రత్యక్షమయి ద్విపాదులు, చతుష్పాదులచే మరణం లేకుండా వరం ఇస్తాడు. వరం ప్రభావంతో విజృంభించిన అరుణాసురుడి.. దేవతలందరిని తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం ప్రారంభించాడు. అతని ఆగడాలకు భయపడిన దేవతలు.. ఆదిశక్తిని ప్రార్ధించారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయి... అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది.

తర్వాత దేవతలు ఆ రాక్షసుడి నుంచి శాశ్వత విముక్తి పొందేందుకు ఓ పథకం పన్నారు. దాని ప్రకారం.. దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెప్తాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానితో అరుణాసురుడి శక్తి క్షీణించసాగింది. ఆ సమయంలో ఆదిశక్తి సృష్టించిన అసంఖ్యాక భ్రమరాలు అరుణాసురుడిని, అతని సైన్యాన్ని సంహరించాయి. తర్వాత దేవతల కోరికపై భ్రమరాంబికగా శ్రీశైల క్షేత్రంలో వెలసింది. సంతోషంతో దేవతలందరూ ఆమెను భ్రామరీ అంటూ స్తుతించారు. ఆ విధంగా వెలిసిన ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఎందరో భక్తులు తరలివస్తుంటారు.

మరో పురాణగాధ :

పూర్వం మహీశురుడు అనే కన్నడ దేశ రాజుకి ఒక కూతురు వున్నది. ఆవిడ శివ భక్తురాలే కాక శివుణ్ణి భర్తగా ఆరాధించేది. ఒకసారి శివుడు ఆ రాజకుమార్తె కలలో కనబడి.. భ్రమరం ఎక్కడ మల్లెపొదమీద వాలుతుంతో అక్కడికి తానొస్తానని చెబుతాడు. మర్నాడు రాజకుమారి భ్రమరం వాలిన మల్లె పొదను కనుగొని అక్కడ శివుడికోసం తపస్సు చేయయం ప్రారంభించింది. ఆమె తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను పరీక్షించాలని ఓ పథకం పన్నుతాడు. శివుడు ఓ వృధ్ధ జంగమదొర వేషంలో వచ్చి తనే శివుణ్ణని చెప్తాడు. రాకుమార్తె తపస్సు చేసుకునే సమయంలో ఆవిడని కాపాడిన అక్కడి చెంచులు వృధ్ధుణ్ణి వివాహం చేసుకోవద్దని వారిస్తారు. అయినా శివుడు ఏ రూపంలో వున్నా ఆయనని వివాహం చేసుకోవటానికి సిధ్ధపడుతుంది రాకుమారి. మల్లెపొదపై భ్రమరం వాలినచోట శివుడికోసం తపస్సుచేసి, శివుణ్ణి భర్తగా పొందిన రాకుమార్తె శ్రీ ‘భ్రమరాంబా దేవి’గా అక్కడ వెలిసిందంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : srisaila bramarambika temple  telugu mythological stories  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more