The Speciality Of Rakhi In The Period Of Kings | Karnavati Princess History | Humayun Historical Story | Alexander Story

Rakhi speciality in the period of kings karnavati princess humayun historical story

rakhi speciality, king alexander, king bahadur shah, king humayun, princess karnavati, rakhi festival india, india rakhil festival, purana stories, telugu mythologicial story, rakhi importance mythological history

Rakhi Speciality In The Period Of Kings Karnavati Princess Humayun Historical Story : The Speciality Of Rakhi Which Helps To Save A Kingdom Of Karnavati Who Send This To Humayun To Help Her From King Bahadur Shah.

రాజ్యాన్నే కాపాడిన ‘రాఖీ’ విశిష్టత

Posted: 09/18/2015 02:02 PM IST
Rakhi speciality in the period of kings karnavati princess humayun historical story

‘రాఖీ’... అన్నాచెల్లెల అనుబంధానికి గొప్ప చిహ్నం. కుల, మత, జాతి అనే విభేదాలు లేకుండా దేశంలో ప్రతిఒక్కరు జరుపుకునే చక్కనైన పండుగ. ఈ రాఖీ పండుగ ఈమధ్య వెలుగులోకి వచ్చింది కాదు.. పురాణాల‌లో దీని ప్రసక్తి చాలా చోట్లే వుంది. ల‌క్ష్మీదేవి, బ‌లిచ‌క్రవ‌ర్తికి రాఖీక‌ట్టిన‌ట్లుగా.. కృష్ణునికి, ద్రౌప‌ది ర‌క్షాబంధ‌నాన్ని అందించిన‌ట్లుగా చెబుతారు. అంతేకాదు.. చ‌రిత్రలో కూడా రాఖీకి సంబంధించిన క‌థ‌లు చాలానే ఉన్నాయి. ఒక‌ప్పుడు యుద్ధానికి వెళ్లే వీరుల‌కు విజ‌యం ద‌క్కాల‌ని కోరుకుంటూ, స్ర్తీలు ర‌క్షాబంధ‌నాల‌ను చేతికి క‌ట్టేవారు. ఈ రాఖీ విశిష్టతను తెలియపరిచే ఓ చరిత్రగాధ కూడా వుంది. అదేమిటంటే..

పూర్వం.. అల‌గ్జాండ‌ర్ భారతదేశంపై దండెత్తి వ‌చ్చిన‌ప్పుడు, అత‌ణ్ని పురుషోత్తముడు అనే రాజు ఎదుర్కొన్నాడు. రోజులు గ‌డిచే కొద్దీ యుద్ధంలో పురుషోత్తముడిదే పైచేయిలా క‌నిపించ‌సాగింది. అత‌ని చేతిలో అల‌గ్జాండ‌ర్ చ‌నిపోవ‌డం ఖాయ‌మనుకున్నారు. ఆ విష‌యం తెలుసుకొన్న అలెగ్జాండ‌ర్ భార్య రొక్సానా.. పురుషోత్తముడికి ఒక రాఖీని పంపింద‌ని చెబుతారు. ఆ రాఖీతోపాటు.. ‘యుద్ధంలో నా భ‌ర్త నీ కంటప‌డితే.. ద‌య‌చేసి అత‌ణ్ని ఏమీ చేయ‌వ‌ద్దు’ అనే సందేశాన్ని కూడా అందించింద‌ట‌. ఈ విధంగా అతనికి సందేశం అందడంతో.. యుద్ధంలో అలెగ్జాండ‌ర్ని హ‌త‌మార్చే అవ‌కాశం వ‌చ్చినా పురుషోత్తముడు త‌న మాట‌ను నిల‌బెట్టుకున్నాడ‌ట‌. అయితే ఈ విష‌యాన్ని ధృవీక‌రించేందుకు త‌గిన ఆధారాలు చరిత్రలో ఏవీ లేవు కానీ.. ఈ కథ మాత్రం చాలాకాలం నుంచి ప్రచారంలో వుంది.

ఇంకొక కథ కూడా చరిత్రలో చెప్పబడి వుంది. 15వ శ‌తాబ్దంలో రాజ‌స్థాన్‌లోని చిత్తోడ్ ప్రాంతాన్ని క‌ర్నావ‌టి అనే రాణి పాలించేది. ఒక‌సారి ఆమె మీద‌కు బ‌హదూర్ షా అనే శ‌త్రువు దండెత్తి వ‌చ్చాడు. అత‌ణ్ని త‌న శాయ‌శ‌క్తులా ఎదుర్కొంటూనే, సాయానికి ర‌మ్మంటూ అప్పటి ముఘ‌ల్ రాజు హుమాయున్‌కి ఆమె రాఖీని పంపింద‌ట. దాన్ని అందుకున్న వెంట‌నే, హుమాయున్ త‌న సైన్యాన్ని చిత్తోడ్‌ వైపు మ‌ళ్లించాడు. ఆ యుద్ధంలో హుమాయున్, క‌ర్నావ‌టిని కాపాడ‌లేక‌పోయినా... బ‌హ‌దూర్‌షాని మాత్రం ఓడించ‌గ‌లిగాడు. ఇలా ఈ విధంగా ఓ రాఖీ రాజ్యాన్ని కాపాడేందుకు దోహదపడింది. ఈ చరిత్రగాధ రాజ‌స్థాన్ చ‌రిత్రలో క‌నిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : rakhi speciality  indian kingdoms  

Other Articles

 • Ramayanam forty seven story

  రామాయణం-47వ-భాగం

  Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

 • Ramayanam forty six story

  రామాయణం-46వ-భాగం

  Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

 • Ramayanam forty five story

  రామాయణం-45వ-భాగం

  Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

 • Ramayanam forty four story

  రామాయణం-44వ-భాగం

  Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

 • Ramayanam forty three story

  రామాయణం-43వ-భాగం

  Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more

Today on Telugu Wishesh