Sarathpurnima nomu details

sarathpurnima nomu, sharathpurnima nomu, sarathpurnima nomu details, lord krishna, telugu festivals, telugu vrathalu, teluvu poojas, telugu nomulu, sarathpurnima nomu details, sarathpurnima news, sarathpurnima date

sarathpurnima nomu, sharathpurnima nomu, sarathpurnima nomu details, lord krishna, telugu festivals, telugu vrathalu, teluvu poojas, telugu nomulu, sarathpurnima nomu details, sarathpurnima news, sarathpurnima date

శరత్పూర్ణిమ నోము (విధివిధానం)

Posted: 02/13/2014 12:46 PM IST
Sarathpurnima nomu details

కథ -

ఒకానొక దంపతులు.. తమకు ఒడ్డూ పొడుగూ, గిడ్డంగుల నిండా ధన ధాన్యరాశులున్నప్పటికీ.. తమ బిడ్డకు అంగసౌష్టవం మాత్రం అమరినట్లు లేకపోవడం వల్ల వారు నిత్యం బాధపడుతూ వుండేవారు. అలా వుండగా ఒకనాడు వారింటికి అతిథిగా వచ్చిన ఒక సిద్ధుడు "దంపతులారా! పూర్వ శాస్త్రాలలో రహాస్యంగా వున్న ఒక నోమును చెబుతాను. అమ్మాయిచేత దానిని ఆచరింపచేయండి'' అని చెప్పి శరత్పూర్ణిమ నోమునూ, ఉద్యాపననూ చెప్పి వెళ్లాడు. ఆ దంపతులు ఆనందించి, శరదృతువు రాగానే తమ కుమార్తె చేత ఆ నోము పట్టించి, విధివిధానంగా జరిపించి ఉద్యాపన చేయించారు. దాంతో ఆ కన్య అమరినట్లుండే అంగ సౌందర్యంతో, సౌష్ఠవంగా ఆనాటి సుందరీమణులయిన అందరిలోనూ సాటిలేనిదిగా ఖ్యాతికెక్కి, పట్టవు రాజును పెళ్ళాడి పదికాలాల పాటు సౌఖ్యంగా జీవించింది.

విధానం - 

శరద్రుదువు మొదలయిన ( అశ్వయుజ శుద్ధ పాడ్యమి) నాడు నోము పట్టాలి. ఆరుబయట చంద్రకాంతిలో వెండితో చేసిన అమ్మవారి ప్రతిమను అర్చించి, ఆనాటి చంద్రకళవంటి వెండి ప్రతిమనూ, బియ్యాన్నీ, తెల్లని వస్త్రాన్నీ, ఒక ముత్యాన్నీ, దక్షిణ తాంబూలాలతో ఒక ఆకర్షణీయమైన బ్రహ్మాణ ముత్తయిదువుకు వాయనమివ్వాలి. అలా పౌర్ణమినాటికి మొత్తం 16 ముత్యాలనివ్వాలి. ఏ తిథిలో వుండే చంద్రకళ ప్రతిమను ఆ తిథినాడు ఇవ్వాలి. బహుళ పక్షంలో ఏమీ చేయనక్కర లేదు. తిరిగి కార్తీక శుద్ధ పాడ్యమినుంచి పౌర్ణమి వరకూ చేయాలి. ఈ విధంగా మూడు సంవత్సరాలు చేసి ఉద్యాపన చేసుకోవాలి.

ఉద్యాపనం -

మూడవ సంవత్సరం కార్తీక పౌర్ణమినాడు నోము యధావిధిగా చేసి, అనంతరం 16 మంది ముత్తయిదువులకు పదహారు కళల చంద్ర ప్రతిమలను ఇచ్చి, వచ్చిన వారందరికీ అమ్మవారి ప్రసాదాన్నే భోజనంగా పెట్టి ఒక బ్రహ్మాణ బ్రహ్మచారిని యధాశక్తి సంతృప్తిగా సత్కరించాలి. ఈ వ్రతాన్ని భక్తిగా ఆచరిస్తే మంచి ఫలం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vinayaka vratha kalpam and pooja procedure

    వినాయక వ్రతకల్పం-పూజావిధానం

    Jun 11 | ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: -... Read more

  • Vata savitri vrat procedure in telugu

    వటసావిత్రి వ్రత విధానం

    Jun 03 | ప్రాచీనకాలం నుంచి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి... అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆనాడు సాక్షాత్తూ దేవుళ్లు కూడా... Read more

  • Moola gowri nomu vidhanam

    మూల గౌరీ నోము కథ - విధానం

    May 07 | కథ : పూర్వం ఒకానొక సమయంలో ఒక మహారాణి తనకోసం, తన తనయుల కోసం, తన రాజ్యంలో వున్న వారందరి శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం మూల గౌరీ నోమును నోచుకుంటుంది. నోము కాలం అయిన... Read more

  • Vishnu vadiyala nomu procedure

    విష్ణు విదియల నోము కథ - విధానం

    Apr 17 | కథ :  పూర్వం ఒక రాజు కూతురు, బ్రాహ్మణ కూతురు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని గడిపేవారు. వీరిద్దరి జీవితంలో ఏ ఒక్క లోటు వుండేది కాదు.  అయితే ఒకరోజు వీరిద్దరూ... Read more

  • Undralla taddi nomu story and procedure

    ఉండ్రాళ్ల తద్ది నోము కథ - విధానం

    Apr 16 | కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి’’ అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు.  ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు... Read more