Hanuman jayanthi festival special

hanuman jayanthi, hanuman chalisa, hanuman with ram, hanuman with ram and laxman, hanuman news, hanuman jayanthi festival, hanuman jayanthi special, hanuman chalisa movie

hanuman jayanthi, hanuman chalisa, hanuman with ram, hanuman with ram and laxman, hanuman news, hanuman jayanthi festival, hanuman jayanthi special, hanuman chalisa movie

హనుమాన్ జయంతి విశేషాలు

Posted: 02/22/2014 03:54 PM IST
Hanuman jayanthi festival special

మన హిందూ సంస్కృతి ప్రకారం మనం జరుపుకునే పండుగల్లో హనుమాన్ జయంతి ముఖ్యమైంది. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు ఎంతో శ్రద్ధగా హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హారతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ పర్వదినం సందర్భంగా అనేక దేవాలయాల్లో అన్నదానాలు నిర్వహిస్తారు. ఆంజనేయస్వామి ధైర్యానికి ప్రతీక. శక్తిసామర్ధ్యాలకు ప్రతిరూపం. ఈయన రాముడికి పరమ భక్తుడు. ఎంతటి వాడంటే.. ఆయన కోసం ఏకంగా సముద్రాన్నే లంకకు చేరుకున్నాడు. ఆకాశమార్గంలో పయనించి సీతమ్మవారి జాడ కనిపెట్టాడు. సంజీవనీ పర్వతాన్ని సైతం పెకిలించి తీసుకొచ్చాడు వీరహనుమాన్. హనుమాన్ జయంతి సందర్భంగా పంచముఖ హనుమాన్, పాదరస హనుమాన్ తదితర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ జయంతినాడు ఉపవాసం వుండడం మంచిదంటారు పూజారులు.

సంవత్సరానికి మూడుసార్లు హనుమాన్ జయంతి : 

ఒక్కో ప్రాంతానికి చెందిన వారు ఒక్కొక్క మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహించుకుంటారు. ఈ లెక్కన హనుమాన్ జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది. కొందరు చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి చేయగా, మరికొందరు వైశాఖమాసం దశమినాడు జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి జరుపుకుంటారు. 

హనుమంతుడి బలం, భక్తి : 

హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండీ కూడా రాముడి సేవలో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆంజనేయునికి శ్రీరాముడంటే ఎంత భక్తిప్రపత్తులు అంటే, తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు. ఒకసారి సీతమ్మ తన నుదుటన సింధూరం పెట్టుకోవడం చూసిన హనుమంతుడు...‘‘నుదుట సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నావమ్మా?’’ అని అడిగాడు. అప్పుడు సీతమ్మ తల్లి నవ్వుతూ "శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండడానికి’’ అని అంటుంది. అంతే, ఆ మరుక్షణమే ఏమీ ఆలోచించకుండా హనుమంతుడు తన ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాడు. అదీ.. రాముడి మీద హనుమంతుడికి వున్న నిరూపమైన భక్తి. 

ఇంకో సందర్భంలో సీతమ్మ హనుమంతునికి రత్నాభరణాన్ని బహూకరించింది. కానీ హనుమంతుడు ఆ భరణంలో వున్న ఒక్కో పూసనూ కొరికి చూసి, విసిరేయసాగాడు.

అదేమిటని సీతమ్మ అడగ్గా.... ''రామయ్య తండ్రి ఈ పూసలలో కనిపిస్తాడేమోనని ఆశగా చూశాను. నా స్వామిలేని రత్నాలు, స్వర్ణాలతో నాకేం పని?” అని సమధానం ఇచ్చాడు.

రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోగా, ఆమెను అన్వేషించడానికి బయల్దేరాడు హనుమంతుడు. అనేకచోట్ల అన్వేషించి చివరకు సీతమ్మ జాడను తెలుసుకున్నాడు. 

అశోకవనంలో శోకమూర్తిలా కూర్చుని, ఆత్మత్యాగం చేయాలనుకుంటున్న సీతమ్మకు శ్రీరాముని అంగుళీయకం చూపి, ధైర్యంగా ఉండమని వచనాలు పలికాడు. లంకను నాశనం చేయడంలో తనవంతు సహాయాన్ని అందించాడు హనుమంతుడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vilambi nama samvasthara ugadi special story

    ఉగాది పండగ విశిష్టత.. కథలు తెలుసా.?

    Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more

  • Kanuma festival special

    కనుమ పండుగ విశిష్టత

    Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more

  • Bhogi festival special

    భోగభాగ్యాల భోగి పండుగ

    Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more

  • Bathukamma the floral festival of telangana

    తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ

    Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more

  • Dasara navarathri special article

    దసరా శరన్నవరాత్రులు

    Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more