Diwali/Deepawali Festival Special Article

Diwali festival of lights

diwali, deepawali, Hinduism, hindu religion, History of Diwali,

Deepawali or Diwali is certainly the biggest and the brightest of all Hindu festivals.

జీవితంలో వెలుగులు నింపే దీపావళి

Posted: 11/05/2013 12:58 PM IST
Diwali festival of lights

భూమి మీద ఒకప్పుడు అందరికీ వెలుగు అందకుండా దూరం చేసిన వాడొకడు ఉండేవాడట. అందుకే వాడు చనిపోతే అందరూ కరువుతీరా దీపాలు వెలిగించుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఎన్నో వరుసలలో దీపాలు వెలిగించుకున్నారు కనుక ఈ వేడుకని దీపావళి అన్నారు. లోకంలో కావలసిన వాటిని, కోరుకోదగిన వాటిని వెలుగుగాను, పనికి రాని వాటిని, హాని కలిగించేవాటిని చీకటిగానూ చెబుతుంటాము.

అవిద్య, అజ్ఞానం, అనారోగ్యం, దుఃఖం, బాధ, చికాకు, దరిద్రం, అపకీర్తి, అవమానం, పాపం మొదలైన మనిషి నాశనానికి, నిరాశానిస్పృహలకి హేతువులైనవన్నీ చీకటిగానూ, జ్ఞానం, ఆరోగ్యం, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, కీర్తి, పుణ్యం మొదలైన మానవునికి కోరుకోదగిన, ఉపయోగపడేవన్నీ వెలుగుగానూ సంకేతించారు. ఈ దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు.  లక్ష్మీ దేవికి శ్రీ అని పేరు. శ్రీ అంటే ఆశ్రమం ఇచ్చేది.... ఆశ్రయింపబడేది. తన గునాల చేత వ్యాపించేది. దోషాలను తొలగించేది. మన మాటలు వినేది, వినిపించేది. ఈ ఆరు లక్షణాలు లక్ష్మీ దేవికి ఉన్నాయి.

ఇవి స్త్రీ లోనూ కనిపిస్తాయి. తండ్రీ, భర్త, పిల్లలూ... కుటుంబ జీవనంలో భాగంగా అంటూ మహిళ క్రమశిక్షణను తెలియజేస్తుంది. పిల్లలూ, కుటుంబ సభ్యుల చేత ఆశ్రయించబడుతుంది. సమాజంలో ఉన్న దోషాలను తొలగించడంలోనూ మహిళ పాత్ర కీలకం. వ్యక్తిత్వం, వాత్సల్యం, ఎదుటి వాళ్ళకు మాట్లడటాన్ని, సంస్కారాన్నీ నేర్పిస్తుంది స్ర్తీ అందుకే ఈ రోజు లక్ష్మీ దేవికి పూజ చేస్తారు.

నరకాసురుణ్ని సత్యభామ చంపడంతో లోకాలకు శాంతి చేకూరుతుంది. ఆ సంతోషాన్ని దీపాలు వెలిగించి, ఈ లోకానికి వెలుగు వచ్చిందనే సంతోషంలో ఈ దీపావళిని జరుపు కుంటారు. దీనిని ధన త్రయోదశి, నరక చతుర్ధశి, దీపావళి, బలి పాడ్యమి, భగినీ ద్వితీయ పేరుతో ఐదు రోజులు చేసుకుంటారు.

శరీరంలోని పంచ కోశముల శుద్ధీ, పంచేంధ్రియాల సాధన... ఇదే అసలైన దీపావళి అంతరార్ధం. నరకుడు విర్రవీగే అహంకారానికి నిదర్శనం... సత్యభామ స్ర్తీకి ప్రతీక. ఆమె భూదేవి అవతారం. అందుకే నరకాసురుణ్ని చంపి.... ఇంద్రుడి ఛత్రం, కుండలాలు వెతికి తీసుకొచ్చింది. ఛత్రం అంటే అధికారం. కుండలాలు అంటే శాస్త్రం.

ప్రపంచంలోని అన్ని దేశాలవారు, అన్ని జాతులవారు ఏదో ఒక సందర్భంలో దీపాల పండుగ చేసుకుంటారు. ప్రతిమనిషి గుండెలోని, సమాజంలోని అన్ని విధాలైన చీకట్లను పోగొట్టి, సకల శుభాలను, సుఖసంతోషాలను, ఆనందోత్సాహాలను విజయ దీపావళి నింపాలని కోరుకుందాం.

దీపావళి పండుగకు ముందు రోజయిన ఆశ్వయుజ బహుళ చతుర్దశిని ‘‘నరక చతుర్దశి’’ అంటారు. హిందువులలో నిర్వహించుకునే ముఖ్య పండుగలలో నరక చతుర్దశి, దీపావళి ఎంతో ముఖ్యమైనవి. ఒక రాక్షసుడ్ని చంపి, ఎంతో ఆనందంగా పండుగను చేసుకోవడమే ఈ నరక చతుర్దశి ప్రత్యేకత.

పూజా విధానం :

నరక చతుర్దశినాడు ఉదయాన్నే లేచి మువ్వులనూనెను తలపై రాసుకొని, అభిషేక స్నానం చేసుకోవాలి. ఆ సమయంలో ప్రత్యేకించి మువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై వుంటారని శాస్త్రాలలో వివరించబడి వున్నాయి.

స్నానం చేసుకున్న తరువాత ‘‘యమాయయ: తర్పయామి’’ అంటూ నువ్వులతో యమునికి మూడుసార్లు తర్పణం ఇవ్వడం ప్రాచీనకాలం నుండి ఆచారంగా వస్తోంది.

యముడిని పూజించుకున్న తరువాత మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు... సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలను కాలుస్తారు. ఇలా ఎవరైతే చేస్తారో.. వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని హిందువులు నమ్ముతారు.

ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు రాత్రి రెండోజాములో నరకాసురిని సంహారం జరిగింది కాబట్టి... మూడో జాములో అభిషేకస్నానం చేసేవారికి నరకబాధ లభిస్తుందని శాస్త్రవచనం.

సాయంకాలం సమయంలో.. ఇంట్లో వున్న దేవుడి మందిరంలోనూ లేదా ఏదైనా దేవాలయంలో దీపారాధన చేయడం చాలా మంచిది.

 

విశేషాలు :

నరక చతుర్దశి పండుగకు - ఖగోళ సంఘటనలకు చాలావరకు సంబంధం వుంది. నరకాసుర వధ - చతుర్దశినాడు ఆకాశంలో రాసులస్తితిని సూచిస్తుంది. తులారాశి తూర్పు క్షితిజం మీద ఉదయిస్తుంటే పడమటి క్షితిజం మీద మేషరాశి అస్తమిస్తుంటుంది.

నరకాసురుడు భూదేవి కొడుకు. మేషం మంచిదే అయినా... ముర్ఖత్వమూర్తి. అందుకే అతని పాలన అంధకారమయం! ఆరోజు మేషరాశి సూర్యాస్తమయ సమయంలో ఉదయిస్తుంది. అది అస్తమించే వరకు చీకటిగానే వుంటుంది. మేష రాశి అస్తమించే వేళకు తులారాశి తూర్పు దిక్కున క్షితిజం మీదికి వస్తుంది.

స్వాతి నక్షత్రానికి వాయువు దేవత. దానిని అధిష్టించి, నరకుని మీదకు కృష్ణుడు - సూర్యుడు, సత్యభామ-చంద్రుడు బయలుదేరుతారు. నరకుడు చనిపోగానే ఆకాశపు అంచులపై దీపచ్చాయాల్లో కన్యారాశి (కన్యల గుంపు) నరకుని బంధాలనుంచి విముక్తి పొంది, తమను విడిపించిన సూర్యున్ని - కృష్ణున్ని నాయకునిగా చేసుకున్నాయి. ఇలాంటి స్థితి నరక చతుర్దశి, దీపావళి రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో లేదు.

 

కథ :

హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూలోకానికి చుట్టుచుట్టి సముద్రంలో ముంచినప్పుడు... విష్ణుమూర్తి వరాహా అవతారం ఎత్తి ఆ రాక్షసున్ని సంహరించి, భూమిని కాపాడుతాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తికి వరప్రసాదం వల్ల భీముడు అనే పుత్రుడు జన్మించాడు. అతడే నరకాసురుడిగా పేరు పొందాడు.

నరుకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా కాపరూప రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. కానీ దురదృష్టవశాత్తూ నరకాసురుడు అసుర ప్రభావంలోపడి ఘోరతపస్సు చేసి, అనేక వరాలు పొందుతాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు.

దాంతో అతడు ఇష్టంవచ్చిన విధంగా దుష్కార్యాలు చేయసాగాడు. అవి పరాకాష్టకు చేరి దేవతలకు తీవ్ర అశాంతికి గురి చేశాయి. దేవమాత అదితి కర్ణ్భారణాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే.. శ్రీకృష్ణుడు ఇతనిని ద్వందయుద్ధంలో ఓడించి, తిరిగి అదితికి అందజేశాడు.

అయితే ఇతను ఓటమి ఒప్పుకోక... మరొకసారి మదుపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చేరపట్టాడు. విచక్షణారహితంగా.. గంధర్వ, దేవ, మానవ కన్యలను అపహరించి, తన అంత:పురంలో వున్న పంజరంలో బంధించడం మొదలుపెట్టాడు. ఇది అతను వ్యసనంగా మార్చుకున్నాడు.

ఇంతటితో ఆగకుండా ఇంద్రునిపై కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించాడు. దీంతో ఇంద్రుడు శ్రీకృష్ణుడిని వేడుకోగా.. నరుకునిపై దండెత్తాడు.

ఆ సమయంలో నరకాసురుడు శ్రీకృష్ణుడి మీద విషపు బాణాన్ని ప్రయోగిస్తాడు. దీంతో కృష్ణుడు స్పృహ కోల్పోగా... పక్కనే వున్న సతీమణి సత్యభామ... ఆ బాణాన్ని చూసి ఉగ్రరాలై.. భయంకరమైన ఒక బాణాన్ని ప్రయోగించి నరకాసురుడిని సంహరించింది. అయితే యాదృచ్ఛికంగా నరకాసురుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది.

 

Satya Bhama Kill Narakasura

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diwali  Deepawali  దివాళి  దీపావళి  

Other Articles

  • Vilambi nama samvasthara ugadi special story

    ఉగాది పండగ విశిష్టత.. కథలు తెలుసా.?

    Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more

  • Kanuma festival special

    కనుమ పండుగ విశిష్టత

    Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more

  • Bhogi festival special

    భోగభాగ్యాల భోగి పండుగ

    Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more

  • Bathukamma the floral festival of telangana

    తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ

    Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more

  • Dasara navarathri special article

    దసరా శరన్నవరాత్రులు

    Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more