పుష్కర్
రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న పవిత్ర నగరాలలో పుష్కర్ ఒకటి. స్వయాన బ్రహ్మదేవుడు తీరుగాడిన ప్రదేశంగా చెబుతారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినది పుష్కర్ సరస్సు. కొన్ని పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు వజ్రనాభుడనే రాక్షసున్ని తన కమలంతో చంపుతుండగా, పువ్వు నుండి కిందపడిన రేకు నుండి పుష్కర్ సరస్సు ఏర్పడిందని కథనం.