బాదామి గుహలు
ఉత్తర కర్నాటక రాష్ట్రంలోని బాగల్ కోట జిల్లాలో ఒక లోయలో బాదామి అనే పట్టణం వుంది. ఇక్కడ చాళుక్యుల కాలంనాటి గుహ దేవాలయాన్ని చూడవచ్చు. ఈ గుహ దేవాలయాలు మొత్తం నాలుగు సముదాయాలుగా ఉంది. మొదటిది అత్యంత పురాతనమైంది కాగా.. ఇందులో శివునికి సంబంధించిన శిల్పాలు, చిత్రాలు కనిపిస్తాయి. రెండవ గుహ పూర్తిగా విష్ణుమూర్తి చెక్కడాలతో ఉంటుంది. ఇక 100 అడుగుల లోతు ఉన్న మూడవ గుహలో విష్ణుమూర్తి త్రివిక్రమ, నరసింహ అవతారాలలో కనిపిస్తాడు. చివరిదైన నాల్గవ గుహ పూర్తిగా జైన మతానికి సంబంధించినది.