జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం బారాముల్లా జిల్లాలో గల హరముక్ పర్వత పాద భాగంలో వున్న ఈ వూలార్ సరస్సు.. సోపూర్, బండీపూర్ పట్టణాల మధ్య వుంటుంది. ఈ సరస్సుని ఆసియా ఖండంలోకెల్లా అతిపెద్ద మంచి నీటి సరస్సుగా పేరుగాంచింది. సూర్యాస్తమయం వీక్షించడానికి అనువైనదిగా ఇది ప్రసిద్ధి.