అల్లం
అల్లం పొడిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ను తొలగించబడతాయి. అంతేకాదు.. టిష్యు డ్యామేజ్, జాయింట్ పెయిన్ నుంచి విముక్తి పొందవచ్చు. వీటితోపాటు.. తిమ్మెర్లు, కండరాల నొప్పి, కడుపునొప్పి, వికారాన్ని నివారించడంలో అల్లం గ్రేట్ గా పనిచేస్తుంది. చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకొని నమలడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. అలాగే నొప్పి ఉన్న ప్రదేశంలో అల్లం పేస్ట్ ను కూడా అప్లై చేయవచ్చు.