ది డర్టీ పిక్చర్ (The Dirty Picture)
90వ దశకంలో దక్షిణాది ఇండస్ట్రీలో సెక్సియెస్ట్ తారగా పేరొందిన సిల్క్ స్మిత జీవితగాధ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఏ విధంగా ఆమె జీవితంలో కష్టాలు ఎదుర్కొని చివరికి తారగా ఎదుగుతుందోనన్న విషయాన్ని ఇందులో చూపించారు. ఈమె పాత్రలో విద్యాబాలన్ నటించింది.