ఫిఫా వరల్డ్ కప్ లో అభిమానులు
బ్రెజిల్ లో నిర్వహించిన ఫిఫా వరల్డ్ కప్ 2014లో ఎన్నడూలేని విధంగా కొన్ని కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొన్నటికి మొన్న గతేడాది ఘనవిజయాన్ని సాధించిన స్పెయిన్ జట్టు ఘోరపరాజయం పాలయి ఇంటిముఖం పట్టింది. అలాగే గురువారంనాడు ఐరోపా అగ్నజట్టు అయిన ఇంగ్లాండ్ భారీ ఆశలతో బరిలోకి దిగినప్పటికీ... అందరి ఆశలన అడియాశలు చేస్తూ చతికిల పడిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లాండ్ కు వున్న అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఎవరూ ఊహించని విధంగా ఇంగ్లాండ్ ఈ విధంగా ఓటమి పాలవ్వడం తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించిందని అభిమానులు తమ మనుసులోని భావనలను వెళ్లగక్కుకున్నారు.