I am divorced can i claim maintenance

Qualified wife can't claim maintenance, Bombay High Court sensational judgement, well qualified wife is not entitled to claim maintainance, qualified can't harass her husband by claiming maintenance, wife capable to earn can't claim maintenance, Family, family court, maintenance, Bombay High Court

A well qualified wife is not entitled to remain idle and harass her husband by claiming maintenance when she is capable to earn

విడాకులు పోందిన నాకు భరణం వర్తిస్తుందా..?

Posted: 02/24/2015 03:51 PM IST
I am divorced can i claim maintenance

విడాకులు పోందిన భార్యలకు వారి జీవనానికయ్యే ఖర్చునే భరణం అంటారు. విడాకులు పోందిన భార్యాలకు వారి భర్తల నుండి భరణం లభిస్తుంది. తాజాగా భరణం చెల్లించే విషయంలో బాంబై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఉన్నత ఉద్యోగాలను చేసేందుకు అన్ని అర్హతలు వున్న మహిళలు వారి పతుల నుంచి భరణం పోందేందుకు అర్హులు కాదని తీర్పును వెలువరించింది. సంపాదించేందుకు అన్ని అర్హతలు వున్నా.. భరణం కోసం భర్తలను భాదించడం సముచితం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భర్త సంపాదనను.. యోగ్యత కలిగిన విడాకులు పోందిన భార్యలు.. కూడా భర్తల నుంచి భరణం పొందే ప్రయోజనాన్ని పొందడం తప్పేనని తీర్పును వెలువరించింది.

ముంబాయి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి భార్య కోర్టును ఆశ్రయించి భరణం కావాలని అడిగిన కేసు పూర్వాపరాలను పరిశీలించిన తరువాత ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ కేసులో భార్య అద్బతంగా సంపాదించే అవకాశాలను వదులుకుని కేవలం భర్త భరణంపైనే ఆధారపడాలని ఆశించడం కుదరదని, దీంతో ఆమెకు భరణం లభించే అవకాశం లేదని తేల్చిచెప్పింది. భరణం అన్నది అర్హత లేని భర్యాలకు మాత్రమే వర్తిస్తుందని అభిప్రాయపడింది. భర్త నుంచి విడాకులు పోంది ఏమి చేయాలో దిక్కుతోచని బార్యలు, వారి జీవనంతో పాటు పిల్లల భవిష్యత్తు ఇచ్చే నెలవారి ఖర్చులని స్పష్టం చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Family  family court  maintenance  

Other Articles

Today on Telugu Wishesh